Revanth Struggles:రేవంత్‌కు తప్పని ఎదురు చూపులు, ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుతారా?

Revanth Struggles: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. సిఎల్పీ భేటీలో కొలిక్కి వస్తుందని భావించిన ఎంపికకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అడ్డు పడటంతో రేవంత్ భవితవ్యం సందిగ్ధంలో పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు విభేదాలను పక్కన పెట్టి ఒక్కటైన నేతలు, గెలిచిన తర్వాత సిఎం పీఠం తమదంటే తమదని పోటీ పడుతున్నారు.

తెలంగాణ సిఎం పీఠం కోసం పోటీ పడుతున్న వారిలో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గీయులే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన అండగా నిలిచిన సామాజిక వర్గం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చినా విభేదాలను పక్కన పెట్టి ఎన్నికల్లో నడిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ వర్గాలను తెరపైకి తీసుకొచ్చారు. ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి పీఠానికి చేరేలా రేవంత్ పావులు కదిపినా అవి ఫలించలేదు.

తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నాయకులు ఉన్నారు. వీరితో పాటు శ్రీధర్‌ బాబు వంటి సీనియర్ పేరు కూడా ప్రచారంలో ఉంది. పార్టీలో సీనియర్లు ఎందరున్నా వారందరిని కాదని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్‌ రెడ్డికి పిసిసి బాధ్యతలు అప్పగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ఎన్నికల ముందు ఎవరు బయట పడలేదు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, సిఎం పీఠానికి రేవంత్ రెడ్డి చేరువ కావడాన్ని మాత్రం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు సహించలేక పోతున్నారు. తమను కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రెడ్డి సామాజిక వర్గ నాయకుల్ని అదృశ్యశక్తులు ప్రోత్సహిస్తున్నాయని రేవంత్ వర్గం ప్రచారం చేస్తోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *