Nizamabad: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం.. కవితకు మహిళ నేతల పాలాభిషేకం..!

 Nizamabad: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం.. కవితకు మహిళ నేతల పాలాభిషేకం..!

ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని విద్యార్థినులు, భారత్ జాగృతి మహిళ నేతలు అంటున్నారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడూ ముందు ఉంటారని అన్నారు. కవిత పోరాట స్ఫూర్తితో

ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని విద్యార్థినులు, భారత్ జాగృతి మహిళ నేతలు అంటున్నారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడూ ముందు ఉంటారని అన్నారు. కవిత పోరాట స్ఫూర్తితో మహిళా బిల్లు ఆమోదంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ప్రజా ప్రతినిధులుగా మారానున్నారని మహిళలు ఆనందం వ్యక్తం చేసారు.

ఇదీ చదవండి: చంద్రబాబు అరెస్ట్‌పై రేవంత్ రెడ్డి సైలెంట్.. అదే అసలు కారణమా ?

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కవిత చిత్రపటానికి విద్యార్థినులు, మహిళా నేతలు, జాగృతి నాయకులు పాలాభిషేకం చేశారు. మొదట నగరంలోని కేసీఆర్ కమాన్ నుండి ఎమ్మెల్సీ కవిత క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి వచ్చారు. ఆనంతరం ఎమ్మెల్సీ కవిత చిత్ర పటానికి క్షిరాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ కవిత పోరాటం ఫలితంగానే పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడం లో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడూ ముందు ఉంటారన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా విశేషంగా కృషి చేస్తున్న.. కవితకు ధన్యవాదాలు తెలిపారు. కవిత పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళల ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత గురించి మొదటి నుంచి పోరాడుతున్న కవితకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది యావత్ మహిళా లోకం విజయంగా అభివర్ణించారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతుందని వారు గుర్తు చేశారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *