Mad For Each Other Promo: హరిత హరీష్‌కి గుండు సున్నా ఇచ్చిన జడ్జీలు.. షో నుంచి ఔట్

 Mad For Each Other Promo: హరిత హరీష్‌కి గుండు సున్నా ఇచ్చిన జడ్జీలు.. షో నుంచి ఔట్

 

జియో హాట్‌స్టార్, స్టార్ మాలో ప్రసారమవుతున్న కపుల్స్ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’కి అనుకున్నంత రీచ్ అయితే రాలేదు. బిగ్‌బాస్, సీరియల్ సెలబ్రెటీ జోడీలతో శ్రీముఖి యాంకర్‌గా, అనిల్ రావిపూడి, రాధ, లయ జడ్డీలుగా నడుస్తున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. అయితే ఈ ప్రోమోలో హరిత హరీష్‌పై జడ్డీలు సీరియస్ అయ్యారు. ఈ వారం హరీష్ బిహేవ్ చేసిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Mad For Each Other Promo

హరిత హరీష్‌కి గుండు సున్నా ఇచ్చిన జడ్జీలు.. షో నుంచి ఔట్
అగ్నిపరీక్ష షో ద్వారా ఆడియన్స్‌కి పరిచయమై బిగ్‌బాస్‌ సీజన్-9లోకి అడుగుపెట్టిన క్యాండెట్ హరిత హరీష్. అసలు అగ్నిపరీక్ష షోలోనే హరీష్‌పై బింధు మాధవి ఏ రేంజులో ఫైర్ అయిందో తెలిసిందే. భార్యపై చేయి చేసుకున్నానని షోలో హరీష్ చెప్పడం.. తనకి కోపమొస్తే ఏం చేస్తానో కూడా తెలీదని ఓపెన్‌గా చెప్పడంతో అసలు బిగ్‌బాస్‌కి ఇతన్ని పంపాలా వద్దా అని కూడ చాలా ఆలోచించారు.

మొత్తనికి అయితే హౌస్‌లోకి వెళ్లాడు కానీ అక్కడ హరీష్ మాట తీరు, ఆట తీరు చూసి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఇటీవలే మొదలైన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో తన భార్యతో కలిసి హరీష్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ షోలో కూడా నూకరాజు, నటరాజ్ మాస్టర్, శివ్‌కుమార్ సహా చాలా మందితో హరీష్‌కి తెగ గొడవైంది. అయితే గత వారం షోలో హరీష్ బిహేవ్ చేసిన విధానంపై మాత్రం జడ్డీలు సీరియస్ అయ్యాారు.

జీరో మార్క్స్
ముఖ్యంగా ఎప్పుడూ చాలా జోవియల్‌గా ఉండే అనిల్ రావిపూడి కూడా హరీష్‌పై ఫైర్ అయ్యారు. నూకరాజు-ఆసియా కలిసి ఒక సేవక్‌గా మిమ్మల్ని ఎంచుకున్నారు.. అసలు మీరు యాక్సెప్ట్ చేయలేదు.. లేదు లేదు అంటూ ఇలా చేయి చూపించారు.. మీరు ఎంత అగౌరవంగా బిహేవ్ చేశారు.. మాట్లాడితే ఈ ఫార్మాట్‌ని బ్లేమ్ చేస్తారు.. ఈ షోకి నేను అవసరం లేదు.. ఈ షోకి నా అవసరమే ఉంది.. నాకు ఈ షో అవసరం లేదు.. అంటారేంటని హరీష్‌పై ఫైర్ అయ్యారు అనిల్ రావిపూడి.

అలానే వీళ్లు వీళ్ల పార్టనర్స్‌తోటి ఎంత పవిత్రంగా ఉన్నారు.. ఒన్ మ్యాన్ ఉమెన్‌లా ఉన్నారా అంటూ తన భార్య హరితతో హరీష్ చేసిన కామెంట్లని స్క్రీన్ మీద చూపిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు జడ్డీలు. మీలా ఒక రూడ్ పర్సన్‌ని నేను ఎప్పుడూ చూడలేదని రాధ అన్నారు. మీరు కూడా ఆయనకి చెప్పాలి హరిత గారు.. ఆయన మాత్రమే గొప్ప భర్త కాదు.. అంటూ లయ అన్నారు.

ఇక ప్రోమో చివరిలో డేంజర్ జోన్‌లో ఉన్న మూడు జోడీల్లో ఒకర్ని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. బ్యాటిల్ ఆఫ్ లవ్‌లో ఇప్పుడు ఒక ఎలిమినేషన్ జరగబోతుంది.. హరిత హరీష్‌కి ఎన్ని మార్కులు ఇస్తారని శ్రీముఖి అడిగితే జీరో అని ముఖం మీదే చెప్పేశారు అనిల్, రాధ. దీంతో మేము అనుకున్నది కాకుండా వేరేది జరుగుతున్నప్పుడు మేము వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నామని హరీష్ చెప్పారు. హరిత గారు మీ అభిప్రాయం కూడా అదేనా అండి.. అని అనిల్ రావిపూడి అడిగితే మేము షోని వదిలి వెళ్లాలనుకుంటున్నామని ఆమె కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈ వారం హరిత హరీష్ షో నుంచి బయటికి వచ్చినట్లే కనిపిస్తుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *