Mad For Each Other Promo: మేము ఇక్కడ ఉండలేం.. షో నుంచి ప్రియాంక జైన్- శివకుమార్ ఔట్

 Mad For Each Other Promo: మేము ఇక్కడ ఉండలేం.. షో నుంచి ప్రియాంక జైన్- శివకుమార్ ఔట్

Mad For Each Other Promo: మేము ఇక్కడ ఉండలేం.. షో నుంచి ప్రియాంక జైన్- శివకుమార్ ఔట్

జియో హాట్‌స్టార్-స్టార్ మాలో ఇటీవలే ఒక కపుల్స్ షో మొదలైంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో బిగ్‌బాస్ సహా సీరియల్ సెలబ్రెటీలతో ఈ షోని రన్ చేస్తున్నారు. ఒక విల్లాలో మొత్తం 10 జంటలని ఉంచి వాళ్ల మధ్య ఉన్న కెమిస్ట్రీ, అలానే జోడీగా ఎంతవరకూ పోటీ పడగలరనేది రకరకాల టాస్కులు పెట్టి పరీక్షిస్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్‌లో ప్రియాంక జైన్-శివ్‌కుమార్.. హరిత హరీష్ మధ్య పెద్ద గొడవైంది. ఈ ప్రోమోపై ఓ లుక్కేద్దాం.

Mad For Each Other Promo

మేము ఇక్కడ ఉండలేం.. షో నుంచి ప్రియాంక జైన్- శివకుమార్ ఔట్

బిగ్‌బాస్ తరహాలో స్టార్ మా, జియో హాట్‌స్టార్ కలిసి ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే షోని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బుల్లితెర సెలబ్రెటీ జోడీలతో యాంకర్ శ్రీముఖి హోస్టుగా ఈ షో నడుస్తుంది. అనిల్ రావిపూడి, నటి రాధ, లయ ఈ షోకి జడ్జీలుగా ఉన్నారు. సోమవారం నుంచి ఆదివారం వరకూ ప్రతి రోజూ రాత్రి 10 గంటలకి ఈ షో స్టార్ మాలో ప్రసారమవుతుంది.

ఇక ఆదివారం ఎపిసోడ్‌లో హరిత హరీష్-ప్రియాంక జైన్-శివ్ జోడీల మధ్య గొడవ జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు. ఆ స్కేల్ ఆఫ్ లవ్‌లో ఎవరు ఏ పొజిషన్‌లో ఉంటారు.. ఎవరి పొజిషన్ తారుమారు అవుతుంది తెలిసేది కూడా ఈరోజే.. అంటూ శ్రీముఖి అనౌన్స్ చేసింది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది.. ఒక 50కి జడ్జీల తరఫు నుంచి కొన్ని క్రెడిట్స్ ఇవ్వబోతున్నాం.. అంటూ అనిల్ రావిపూడి చెప్పారు.

శివ్ Vs హరిత హరీష్
ఇందులో భాగంగా సిద్ధూ- సోనియా బాండ్‌కి 20 క్రెడిట్స్, వాసంతి-కళ్యాణ్‌కి 20, హరిత హరీష్‌కి 30 మార్క్స్, శివ్-ప్రియాంకకి 35 మార్క్స్.. ఇస్తున్నట్లు జడ్జీలు ప్రకటించారు. దీనికి ఎవరూ ఏం మాట్లాడలేదు కానీ శివ్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశాడు. 35 మాకు ఇచ్చి 30 ఆయనకి (హరీష్) ఇచ్చినప్పుడు మాకు అన్యాయం అనిపించింది.. అంటూ ప్రియ-శివ్ అన్నారు.

ఈ మాటలకి గట్టి కౌంటర్ ఇచ్చాడు హరిత హరీష్. 15 ఇవ్వాల్సిన ప్లేస్‌లో 20 ఇచ్చినప్పుడు మాకు 5 ఎక్స్‌ట్రా ఎందుకు ఇచ్చారని ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయారు.. సంకలు గుద్దుకొని బాగా వచ్చాయని అప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ఫైర్ అయ్యాడు. ఈ మాటకి శివ్ కూడా ఆవేశంతో ఊగిపోయాడు. నేను మా గురించి అడిగాను అక్కడ.. సంకలు అలా అని మాట్లాడొద్దు చెప్తున్నా.. అంటూ వేలు చూపిస్తూ ఆవేశపడ్డాడు.

కంపేరిజన్ చేసినప్పుడు మొత్తం మాట్లాడటానికి రెడీగా ఉండాలి.. అంటూ హరీష్ కౌంటర్ ఇచ్చాడు. ఇక హరీష్ మాటలకి హర్ట్ అయిపోయిన ప్రియాంక-శివ్.. ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇలాంటి బిహేవియర్‌తో మేము షోలో కొనసాగగలమని మేము అనుకోవడం లేదు.. మేము షో నుంచి క్విట్ అవుదామనుకుంటున్నాం.. అంటూ అందరిముందు చెప్పేశారు. ఈ మాటకి జడ్జీలతో పాటు మిగిలిన జోడీలు కూడా షాకయ్యాయి. మరి ప్రియ-శివ్ అదే నిర్ణయంతో ఉంటారా లేక శ్రీముఖి-జడ్జీలు మళ్లీ ఏదైనా చెప్పి ఉంచుతారా అనేది చూాడాలి. భారీ అంచనాలతో మొదలైన ఈ షో ప్రస్తుతానికి అయితే అనుకున్నంతగా ఏం రీచ్ అవ్వడం లేదు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *