Mad For Each Other Day 02: తొమ్మిది జంటలకు ఒకేసారి ఫస్ట్ నైట్.. కెమెరాల ముందు చెలరేగిన ప్రియాంక జైన్, శివ్.. వామ్మో అరాచకం సామీ
Mad For Each Other Show Telugu Today Episode: బిగ్ బాస్ షోనే గబ్బు షో అంటే.. అంతకు మించిన కథలు, కార్యక్రమాలు నడిచే షో వచ్చేసింది అదే మాడ్ ఫర్ ఈచ్ అదర్ (Mad For Each Other). వయసులో ఉన్న ఓ పది పెళ్లైన, పెళ్లికాని జంటల్ని ఓ రిసార్ట్స్‌లోకి తీసుకుని వచ్చి.. వాళ్లకి అన్ని వసతులతో బెడ్ రూంలు కేటాయించి.. మీరు చెలరేగిపోండి.. మీ చుట్టూ కెమెరాలు ఉన్నాయ్ కాబట్టి.. ఫుటేజ్‌తో మేం చెలరేగిపోతాం అన్నట్టుగా ఈ షోని డిజైన్ చేసినట్టే కనిపిస్తుంది తొలి రెండు ఎపిసోడ్‌లను చూస్తుంటే.

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో
దాదాపు బిగ్ బాస్ కాన్సెప్ట్‌తోనే ఉన్న ఈ ‘మ్యాడ్ డ్ ఫర్ ఈచ్ అదర్’ హాట్ స్టార్‌లో ప్రసారం అవుతుంది. ఈ షోను శ్రీముఖి హోస్ట్ చేస్తుంది. ఇందులో పెళ్లై జంటలతో పాటు.. పెళ్లి కాని జంటల్ని కూడా తీసుకొచ్చి వాళ్లని కపుల్స్‌గా చూపిస్తూ వాళ్లకి బెడ్ రూంలు కేటాయించడం ఈ షోలో కొసమెరుపు. వీరిలో మొత్తం పది జంటలున్నాయి. వీళ్లంతా టీవీ ఆర్టిస్ట్‌లే కావడం విశేషం.
1. సోనియా, సింధు
2. అంజలి, పవన్
3. అషియా, నూకరాజ్
4. వాసంతి, కళ్యాణ్
5. ప్రియాంక జైన్, శివ్ కుమార్
6. సంధ్య, బ్రిట్టో
7. నీతూ, నటరాజ్
8. హారిక, హరీష్
9.జాను, భాను
10. సంద్ర, మహేష్
ఇలా మొత్తం పది జంటలు ఉండగా.. గత ఎపిసోడ్‌లో వీరిలో బ్రిట్టూ, సంధ్యల జంట హౌస్‌లోకి వెళ్లకుండానే ఎలిమినేట్ చేసి ట్విస్ట్ ఇచ్చారు మిగిలిన తొమ్మిదిజంటలు. అయితే ఈ తొమ్మిది జంటలు నేటి (మార్చి 16) ఎపిసోడ్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఇక వాళ్లు హౌస్‌లోకి వెళ్లి కంటెంట్ ఇవ్వడంలో చెలరేగిపోయారు. వారిలో అందరికంటే ఓ అడుగు ముందే ఉంది మన బిగ్ బాస్ పుత్రికారత్నం ప్రియాంక జైన్. ప్రియుడు శివ్ కుమార్‌తో కలిసి చెలరేగిపోయింది.
Priyanka Jain
రిసార్ట్స్‌లో ఈ తొమ్మిది జంటల్లో ముందు ఆరు జంటలకు లగ్జరీ రూంలను కేటాయించారు. ఆ గదిలోకి వెళ్లగానే.. ‘పడుకోవచ్చా ప్రేమ గురూ’ అని శివ్ అడిగితే.. ఓవర్ ఎగ్జైట్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రియాంక జైన్.. ఎంత బావుందో అంటూ పక్కనే ఉన్న శివ్‌ని పిసికేస్తూ ముద్దుపెట్టేసింది. ప్రియాంక జైన్ బయటతింటుంటే పక్కనే కూర్చన్న శివ్.. నిన్ను వదిలేసి ఒంటరిగా పడుకోవాలని అనిపించడం లేదు అని అన్నాడు. దాంతో ప్రియాంక.. మీదికి లాక్కుని లాలీజో లాలీజో అంటూ కెమెరాల వైపు చూస్తూ కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది.ఆ తరువాత శివ్ అని పిలవగానే.. ఇద్దరూ పరుగుపెట్టుకుంటూ వచ్చి ముద్దుల వర్షం కురిపించుకున్నారు. బిగ్ బాస్‌లో కంటెంట్ ఇవ్వడంలో బాగా ఆరితేరిన ప్రియాంక డైరెక్షన్‌లో శివ్ దూసుకుని వెళ్లిపోతున్నాడు.
నువ్వు ఉన్నావ్ కాబట్టే నేను ఇక్కడ ఉండగలుగుతున్నా.. అసలు నువ్వు అన్ని రోజులు బిగ్ బాస్‌లో ఎలా ఉన్నావో అర్థం కావడం లేదు.. నువ్వు చాలా గ్రేట్. నీనైతే ఉండలేను అని అన్నాడు. దాంతో ప్రియాంక.. నేను ఉన్నాకదా అంటూ గట్టిగా హగ్ చేసుకుని మళ్లీ రొమాన్స్ స్టార్ట్ చేసింది. మొత్తానికి ఈ ఇద్దరూ పెళ్లి కాకుండానే శోభనం పెళ్లి జంటలా ఆ హౌస్‌లో చెలరేగిపోతున్నారులెండి.
నటరాజ్ మాస్టర్, అతని భార్య మాత్రం చాలా పద్దతిగా డీసెంట్‌గా బిహేవ్ చేస్తూ కనిపించారు. మాస్క్ మెన్ హరీష్ భార్య అయితే.. గదిలోకి వెళ్లిన తరువాత ఇదేంటి నాన్నా.. రూంలో కూడా కెమెరాలు ఉన్నాయ్ అని షాక్ అయ్యింది. అంజలి, పవన్.. వాసంతి, కళ్యాణ్‌ల వంతు రావడంతో వాళ్లు వెళ్లి తమకి కేటాయించిన గదుల్లోకి వెళ్లారు. అంజలి అయితే గదిలోకి వెళ్లి ‘రేయ్ నానీ.. రూమ్‌లో కెమెరాలు ఉన్నాయ్ రా’ అనిపెద్దగా అరిచి చెప్పింది. ఇక హరిత హరీష్ అయితే.. నేను ఫేక్‌గా ఉండలేను.. కాస్త టైమ్ పడుతుంది అంటూ బిగ్ బాస్‌లో చెప్పిన పాఠాలే మళ్లీ మొదలుపెట్టాడు. రంభ, ఊర్వశి, మేనకలు నన్ను రమ్మని పిలిచినా కూడా నేను నీతోనే ఉంటాను.. అంతకంటే నీకేం కావాలి అంటూ హారికతో అని దగ్గరకు తీసుకున్నాడు హరీష్.
బ్రిట్టు, సంధ్య రీ ఎంట్రీ.. స్పెషల్ పవర్‌తో ఫసక్
కపుల్స్ నిర్ణయంతో ఎలిమినేట్ అయిన బ్రిట్టు, సంధ్యలకు మరో ఛాన్స్ ఇచ్చారు. ప్రేమ ఉన్న ప్రతిచోటా మరో అవకాశం ఉండనే ఉంటుంది.. కాబట్టి మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంది కాబట్టి మరో అవకాశం ఇస్తున్నా. ఇందుకోసం మీకొక ఛాలెంజ్ ఇస్తున్నా అంటూ ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి.
ఆ తరువాత లవ్ మాన్షన్‌లోకి వెళ్లి లవ్ కపుల్స్‌తో మాట్లాడింది శ్రీముఖి. మీ ఫస్ట్ నైట్ ఎలా ఉంది అని అడిగింది శ్రీముఖి. మేం ఎక్కడుంటే అక్కడే హనీమూన్. మా అందరి హనీమూన్ ఇక్కడే జరిగిపోతుంది అని అన్నాడు హరిత హరీష్. స్వర్గంలో ఉన్నట్టు ఉంది అంటూ మాన్షన్ హౌస్‌ని తెగ ఎత్తేశారు.
made for each other
మేం ఆరు బెడ్‌లు పెడితే.. సింగిల్ సింగిల్ పడుకోవాలని చెప్తే మీరు మూడు బెడ్లలో ఇద్దరిద్దరుగా పడుకుంటున్నారు.. మేం అంత వెధవల్లా కనిపిస్తున్నామా? అని షాకిచ్చింది శ్రీముఖి. ఆ తరువాత సంధ్య, బ్రిట్టోలు టాస్క్‌లో గెలవడంతో మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మిమ్మల్ని ఎవరెవరు ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారో తెలుసుకదా.. మరి వాళ్లకి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? అని శ్రీముఖి ఫిటింగ్ పెట్టింది. దాంతో తెలుగు రాదనే కారణంతో ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు. మీ అందరిపైన చిరాకు కలిగింది. నేను ఆడగలనో లేదో.. నా సామర్థ్యం ఏంటో మీకు తెలియదు. తమిళ్ నుంచి వచ్చినా కూడా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించారు కానీ.. మీరు మాత్రం దూరం పెట్టి ఎలిమినేట్ చేశారు. నాకు తెలుగు రాకపోతే మీరు నేర్పండి నేర్చుకుంటాను. కానీ మీరు నేర్పితే నేర్చుకుంటాను కదా.. కానీ అదే కారణంతో నన్ను ఎలిమినేట్ చేయడం నచ్చలేదని అన్నాడు బ్రిట్టు. సంధ్య కూడా లాంగ్వేజ్ బారియర్స్ లేకుండా వేరే కారణంతో నామినేట్ చేస్తే బావుంటుంది అని ఇంటి సభ్యుల్ని కోరింది.
శ్రీముఖి
Sreemukhi
బ్రిట్టు, సంధ్య రివేంజ్..
ఆరు జంటలకు రూం కేటాయిస్తే.. మూడు జంటలకు డామ్ (కామన్ రూం) ఇచ్చారు. ఇక ఎలిమినేషన్‌ని దాటుకుని వచ్చిన సంధ్య, బ్రిట్టోలకు రూం ఉండదని.. వాళ్లు బయట హాల్‌లోనే ఉండాలని ట్విస్ట్ ఇచ్చింది శ్రీముఖి. బాత్‌కి వెళ్లాలన్నా.. స్నానానికి వెళ్లాలన్నా ఇక్కడున్న ఇంటి సభ్యుల్ని అడిగి మాత్రమే వెళ్లాలని ట్విస్ట్ ఇచ్చింది శ్రీముఖి. ఇక ఎలిమినేషన్‌ని ఎదుర్కొని వచ్చి సంధ్య, బ్రిట్టోలకు మరో స్పెషల్ పవర్ ఇచ్చింది శ్రీముఖి. లివింగ్ ఏరియాలోనే మీరు పడుకోవాలని చెప్పాం కదా.. ఓ జంటతో మీరు స్వాప్ చేసుకోవచ్చని చెప్పింది. దాంతో తమని ఎలిమినేషన్‌కి నామినేట్ చేసిన వాళ్లపై రివేంజ్ తీర్చుకోవాలని ఆ నాలుగు జంటల్లో ఒకర్ని స్వాప్ చేస్తున్నట్టు శ్రీముఖి చెవిలో చెప్పారు సంధ్య, బ్రిట్టో. వాళ్లలో అంజలి పవన్, వాసంతి పవన్‌లో ఈ రెండు జంటల్లో ఓ జంటని స్వాప్ చేశారు సంధ్య, బ్రిట్టో. మరి ఆ జంట ఎవరో తరువాతి ఎపిసోడ్‌లో రివీల్ చేయనున్నారు.