Lokesh: మంత్రి పదవికి లోకేష్ రాజీనామా.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!
విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓపెన్ ఛాలెంజ్.. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ – 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి గారు? మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన లోకేష్.. ‘ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్- 3లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి?’ అని ప్రశ్నించారు.