Free AI Course: విద్యార్థులు, ఉద్యోగులకు ఫ్రీ AI కోర్స్‌.. గవర్నమెంట్ స‌ర్టిఫికెట్‌ కూడా..!

 Free AI Course: విద్యార్థులు, ఉద్యోగులకు ఫ్రీ AI కోర్స్‌.. గవర్నమెంట్ స‌ర్టిఫికెట్‌ కూడా..!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌‌కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువ‌త కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథ‌పై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించింది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌‌(Young AI for All)కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువ‌త కోసం కేంద్ర ప్రభుత్వం(central-government-scheme) కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథ‌పై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించింది. ‘యువ ఏఐ ఫర్‌ ఆల్’ పేరిట ఈ కోర్సును అందిస్తున్నది. ఈ కోర్సు 4.5 గంటల నిడివి క‌లిగి ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఏఐపై ప్రాథమిక అవగాహన వస్తుంది. కోర్సును చాలా సరళంగా, నిజ జీవితంలో ఉపయోగించే ఉదాహరణలతో రూపొందించారు. ఇది ఫ్యూచర్‌స్కిల్స్‌ ప్రైమ్‌, iGOT కర్మయోగి సహా మిగిలిన ప్రముఖ ఎడ్‌టెక్‌ పోర్టళ్లలో అందుబాటులో ఉంది. కోర్సు పూర్తి చేసిన వారికి భారత ప్రభుత్వం సర్టిఫికెట్‌ కూడా ఇవ్వనుంది. ఈ కోర్సులో మొత్తం 6 మాడ్యూల్స్‌ ఉంటాయి.

ఏఐ కోర్సు(Free AI Course) నేర్చుకోడానికి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్‌పేజ్‌ కుడివైపు ‘ఎన్‌రోల్‌’పై క్లిక్‌ చేయాలి. గూగుల్‌ లేదా లింక్డిన్‌ ఖాతా ద్వారా అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. పేరు, పుట్టినతేదీ, జెండర్ లాంటి వివరాలు ఎంటర్‌ చేయాలి. మొబైల్‌ నెంబర్‌ ఎంటర్ చేసి, ఓటీపీతో ధ్రువీకరించాలి. ఐడీ ఇవ్వాలి, లేక‌పోతే ఇవ్వక‌పోయినా ప‌ర‌వాలేదు చివ‌ర‌గా చెక్‌బాక్స్‌లో టిక్‌ చేసి సబ్మిట్‌ చేయాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *