Foot Exercises: కూర్చున్నచోటే చేయగలిగే పాదాల వ్యాయామాలు.. నొప్పులన్నీ తగ్గిపోతాయ్..

 Foot Exercises: కూర్చున్నచోటే చేయగలిగే పాదాల వ్యాయామాలు.. నొప్పులన్నీ తగ్గిపోతాయ్..

Foot Exercises: పాదాల నొప్పులతో ఇబ్బంది పడే వాళ్లకి కొన్ని సులభమైన వ్యాయామాల ద్వారా ఉపశమనం దొరుకుతుంది. ఇంట్లో కూర్చున్న చోటే చేయగలిగే ఈ వ్యాయామాల గురించి తెల్సుకోండి.

బరువు ఎక్కువగా ఉన్నవారు, బలంగా అడుగులు వేసే వారికి, ఆరోగ్య సమస్యల వల్లా చాలా మందికి పాదాల నొప్పుల సమస్యలు ఉంటాయి. కూర్చున్న చోటు నుంచి లేచిన వెంటనే నాలుగు అడుగులు వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాస్త నడిచిన తర్వాత బాగానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పాదాల నొప్పుల సమస్యలు ఉన్నా, అవి మరి కాస్త ఫ్లెక్సిబుల్‌గా మారాలన్నా కొన్ని వ్యాయామాలు రోజుకోసారైనా తప్పకుండా చేసుకోవాల్సిందే. అప్పుడే అవి కాస్త మన నడకకు సహకరిస్తాయి. ఆ వ్యాయామాలు ఏమిటంటే..

1. కుర్చీలో కాళ్లను నేల మీద సమాంతరంగా ఆనించి కూర్చోండి. పాదాలను నేలకు తాకించి వేళ్లను పైకెత్తుతూ ఉండండి. ఐదు సెకన్లు అలా ఉన్నాక మళ్లీ కాలి వేళ్లను కిందికి దించండి. ఇలా పది సార్లు చేయండి.

2. ఇప్పుడు నిటారుగా నిలబడండి. కావాలనుకుంటే చేతులతో గోడను ఆనుకోండి. కాలి వేళ్ల మీద నిలబడి మడమల్ని పైకి ఎత్తండి. ఇలా ఐదు సెకెన్లు ఉండి మళ్లీ సాధారణ స్థితికి రండి. ఇలా పది సార్లు చేయొచ్చు.

3. కుర్చీలో ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని కూర్చోండి. ఒక కాలి వేళ్లను చేతికి అందే విధంగా పెట్టుకోండి. కాలి బొటను వేలిని చేతితో పట్టుకుని నాలుగు వైపులకూ లాగండి. కాలి గమనం విషయంలో బొటన వేలు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకనే దీన్ని కాస్త స్ట్రెచ్‌ చేస్తూ అన్ని వైపులకూ కదపండి. తర్వాత రెండో కాలి బొటని వేలిని కూడా ఇదే విధంగా చేయండి.

4. ఎలాంటి ఇబ్బందీ లేకుండా కుర్చీలో నిదానంగా కూర్చోండి. కాలి కింద ఓ నేప్‌కిన్‌ లాంటి దాన్ని పరుచుకోండి. కాలి వేళ్లతో దాన్ని లోపలి వైపుకు లాగండి. మళ్లీ సరి చేయండి. ఇలా ఓ పది సార్లు చేయండి.

5. చపాతీ కర్ర లాంటి గుండ్రటి కర్రతోనూ వ్యాయామం చేయవచ్చు. చపాతీ కర్రను పాదాల కింద పెట్టుకుని అటూ ఇటూ దొర్లించండి. అందువల్ల పాదాల్లో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. నొప్పుల్లాంటివి ఉన్నా తగ్గుతాయి.

6. కుర్చీలో కూర్చుని కాళ్ల దగ్గర చిన్న చిన్న రాళ్లను వేసుకోండి. కాలి వేళ్లతో వాటిని పట్టుకుని కాసేపు అలా ఉండండి. తర్వాత వదిలేయండి. రెండో కాలితోనూ ఇలాగే చేయండి. ఇలా చేయడం వల్ల పాదాల్లో ఉండే కండరాలు బలోపేతం అవుతాయి.

7. చెప్పులు లేకుండా చక్కగా ఇసుకలో నడవండి. అందువల్ల పాదాల లోపల ఉన్న నరాలు ఉత్తేజితం అవుతాయి. అలాగే కండరాలూ బలోపేతం అవుతాయి. పాదాల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *