Chicken Chops : టేస్టీ.. టేస్టీగా చికెన్ చాప్స్ చేయడం ఎలా? చాలా ఈజీ
Chicken Chops Recipe : వీకెండ్ వచ్చినప్పుడు ఇంట్లో నాన్ వెజ్ కొత్తగా ట్రై చేసి తింటే ఆ తృప్తే వేరు. అందులో భాగంగా చికెన్ చాప్స్ తయారు చేసి తినండి. చేసేందుకు ఈజీ.. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ తినాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందోనని అనుమానపడతారు. మీరు కావాలనుకుంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ చాప్స్ చేసేయెుచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తింటుంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
నిజానికి చికెన్ ఐటమ్లలో దాదాపు అందరికీ ఇష్టమైన వంటకం చాప్స్. అన్నం, రోటీ, పూరీ, చపాతీతో చికెన్ చాప్స్ కూడా తినవచ్చు. పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులను విరివిగా వాడటం వల్ల చాప్స్ ఎప్పుడూ పచ్చగా కనిపిస్తాయి. మీ దగ్గర పచ్చి మిరపకాయలు లేకపోతే చికెన్ చాప్స్ చేయడానికి ఎండు మిరపకాయలను కూడా ఉపయోగించవచ్చు. చికెన్ చాప్స్ రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
చికెన్ చాప్స్ తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్ – 1 కిలో, ఉల్లిపాయ – 3, వెల్లుల్లి – 2, లవంగాలు – 5, అల్లం – 1 అంగుళం, కొత్తిమీర – 1 కట్ట, పుదీనా – 1/2 బంచ్, నల్ల మిరియాలు – 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 6, ఎండు కొబ్బరి – 1 కప్పు, నూనె – అవసరం ప్రకారం
తయారీ విధానం
1. స్టోర్ నుండి తెచ్చిన చికన్ను శుభ్రమైన నీటిలో 4-5 సార్లు కడిగి, నీటిని వడకట్టండి.
2. చికెన్లో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 1-2 గంటలు మ్యారినేట్ చేయండి (సమయం లేకపోతే మ్యారినేట్ చేయకుండా తయారు చేసుకోవచ్చు)
3. పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి మెత్తగా అయ్యే వరకు తక్కువ మంటపై వేయించాలి.
4. తర్వాత మెంతికూర, లవంగాలు, పచ్చిమిర్చి వేసి మళ్లీ 2 నిమిషాలు వేయించాలి
5. చివరగా అల్లం, కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగు, పుదీనా, ఎండుమిర్చి వేసి ఒకసారి కలపాలి.
6. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
7. మరొక పాత్రలో నూనె వేడి చేసి, చికెన్ వేసి 5-10 నిమిషాలు ఎక్కువ మంట మీద వేయించాలి
8. తర్వాత రుబ్బిన మిశ్రమాన్ని వేసి, ఉప్పు నీటిని సర్దుబాటు చేసి చికెన్ ఉడికినంత వరకు ఉడికించాలి.
9. నూనె తీసివేసిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, వేడి, రుచికరమైన చికెన్ చాప్స్ లను అన్నం, చపాతీతో వడ్డించండి. చాలా రుచిగా ఉంటాయి.