కర్కాటక రాశి వారికి విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది.సింహ రాశి వారు బంధు, మిత్రులతో కలిసి వింధు, వినోదాల్లో పాల్గొంటారు.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో. మేష రాశి వారికి ఈరోజు విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే బెటర్. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వృషభ రాశి వారు ఈరోజు ప్రయత్నకార్యాల్లో […]Read More
ఈ సంక్రాంతికి అధిక సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను నడిపింది.దీంతో ఇప్పటి వరకూ సంస్థకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ కాసుల వర్షాన్ని కురిపించింది. భారీ లాభాలు తెచ్చిపెట్టింది. స్పెషల్ సర్వీసులు, రాయతీలు బాగానే కలిసివచ్చాయి. ఫలితంగా.. ఏపీఎస్ ఆర్టీసీకి కోట్లల్లో లాభాలు వచ్చి పడ్డాయి. సంక్రాంతి పండుగ అంటేనే ఏపీ ప్రజలకు పెద్ద […]Read More
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసిన కార్యకర్తలు పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు.. రోడ్డెక్కి ఆందోళన ఇందిరమ్మ రాజ్యంలో గూండాయిజమా?: కేటీఆర్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక.. దాడులా: హరీశ్‌రావు కాంగ్రెస్ డీఎన్ఏలోనే ద్వేషం, హింస: కవిత యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ అధినేత […]Read More
ఆంధ్రులకు అతిపెద్ద పండగైన సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయడంలో ఏపీఎ్సఆర్టీసీ విఫలమైంది. సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయని ఆర్టీసీ.. బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షణ అధికారులపై ప్రయాణికుల ఆగ్రహం విద్యాసంస్థల బస్సులు వాడుకోవాలన్న సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన ఎండీ తిరుమలరావు ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌తో మాట్లాడి తక్షణ ఏర్పాట్లు ఆంధ్రులకు అతిపెద్ద పండగైన సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయడంలో ఏపీఎ్సఆర్టీసీ విఫలమైంది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు […]Read More
ఏపీలో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పందేలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగులు కాస్తున్నారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. Pandem kollu: సంక్రాంతి పండుగకు మరో వారం ఉండగానే ఏపీలో పందెం కోళ్ల హంగామా నడుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గుట్టు చప్పుడు కాకుండానే పందెం రాయుళ్లు కాలుదువ్వుతున్నారు. పెద్దగా హంగామా చేయకుండా రాత్రి వేళల్లో రహస్యంగా పందేలు నిర్వహిస్తున్నారు. […]Read More
దగ్గుబాటి సురేష్ రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై విచారణ చేసిన కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ఆదేశాలున్నా.. పాటించకుండా దౌర్జన్యం చేసినందుకు అని చెప్పింది. డెక్కన్ హోటల్ కూల్చివేతలపై దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సివిల్ కోర్టులో […]Read More
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. డబ్బుల కోసం బెదిరింపులు, అక్రమంగా భూములు పట్టా చేయించుకోవడం ఆపాలన్నారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోని ఈ మేరకు లేఖ అంటించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఆయన స్వగ్రామంలో మావోయిస్టుల పేరిట లేఖను అంటించడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. బాలానగర్, రాజాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న […]Read More
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా-ఈ కార్ రేస్ ఈవెంట్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కేసీఆర్ ఒక భోళా శంకరుడు. ఒక గొప్ప నాయకుడని పొగడటం చర్చనీయాంశమైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలనంగా […]Read More
ప్రపంచ తెలుగు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మర్చిపోవడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీని వెనుక ఓ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. యాంకర్ కు చదువురాదా? అని ప్రశ్నించారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో యాంకర్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మరిచిపోయిన విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]Read More
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి. సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. […]Read More