BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు… దరఖాస్తులకు ఇవాళే లాస్ట్ డేట్

 BRAOU Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు… దరఖాస్తులకు ఇవాళే లాస్ట్ డేట్

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు (braouonline.in)
Maheshwaram Mahendra Chary • HT Telugu
Sep 30, 2023 06:55 AM IST
Share on Twitter
Share on Facebook
Share on Whatsapp
మమ్మల్ని ఫాలో అవ్వండి
Ambedkar Open University Admissions 2023: అంబేడ్కర్ దూర విద్య కోర్సుల్లో చేరే గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ మేరకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
BRAOU Admissions 2023- 24: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. అయితే ఇప్పటికే పలుమార్లు దరఖాస్తుల గడువు పొడిగించగా… ఇవాళ్టితో (సెప్టెంబర్ 30) ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.

కోర్సులు ఇవే…
డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది. ఇందులో అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ .. సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.

అర్హతలు…
అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ – తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ – ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..
– ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.06.2023

– ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.09.2023.

– దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

– అధికారిక వెబ్ సైట్ – https://www.braouonline.in/

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *