Bigg Boss Promo Today: బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా సంచలన నిర్ణయం.. ‘ఢమాల్’ పవన్‌ని కెప్టెన్‌గా పీకేసిన నాగార్జున.. రీతూ చౌదరికి చెక్కుడే

 Bigg Boss Promo Today: బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా సంచలన నిర్ణయం.. ‘ఢమాల్’ పవన్‌ని కెప్టెన్‌గా పీకేసిన నాగార్జున.. రీతూ చౌదరికి చెక్కుడే

Bigg Boss Promo Today: బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా సంచలన నిర్ణయం.. ‘ఢమాల్’ పవన్‌ని కెప్టెన్‌గా పీకేసిన నాగార్జున.. రీతూ చౌదరికి చెక్కుడే

Nagarjuna Bigg Boss: అబ్బబ్బా వాయింపు అంటే మామూలుగా లేదు. సరిగ్గా జనం ఏదైనా జరగాలని కోరుకున్నారో అదే జరిగింది. డీమాన్ పవన్, రీతూ చౌదరిలకు తుక్కు రేగ్గొట్టారు హోస్ట్ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 9 రెండోవారంలో హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు డీమాన్ పవన్. అతను కెప్టెన్ అయ్యాడు అనేకంటే.. రీతూ చౌదరి చేసిందీ అని చెప్తే బావుంటుంది. ఎందుకంటే.. ఈమెను సంచాలక్‌గా పెట్టడంతో.. తొలి నుంచి డీమాన్ పవన్ కెప్టెన్ కావాలని కోరుకున్న రీతూ.. అవకాశం రావడంతో ఆడేవాళ్లని పక్కనెట్టి.. డీమాన్‌ని కెప్టెన్‌ని చేసి ఢమాల్‌ని చేసేసింది.

Bigg Boss Telugu 9 Promo
అబ్బబ్బా.. జనం ఏదైతే జరగాలని కోరుకున్నారో అదే జరిగింది. బిగ్ బాస్ హౌస్‌లో కామంతో కటకటలాడిపోతున్న ఢమాల్ పవన్ అలియాస్ డీమాన్ పవన్, రీతూ చౌదరి ల తుక్కు రేగ్గొట్టారు హోస్ట్ నాగార్జున . ప్రియుడ్ని కెప్టెన్‌ని చేయడానికి దిగజారిపోయిన రీతూ చౌదరి సంచాలక్‌గా తనకి ఇచ్చిన బాధ్యతని అటకెక్కించి ఢమాల్ పవన్‌ని కెప్టెన్‌ని చేసింది. అసలు ఆ ఢమాల్ పవన్ కెప్టెన్ అయిన తీరు.. రీతూ దిగజారుడు చూస్తే ఆడియన్స్‌కి ఇంత దారుణమా? అని రక్తం ఉడికిపోయింది. వస్తాడు.. వస్తాడు.. వీకెండ్‌లో నాగార్జున వస్తాడు.. ఇద్దరికీ చెక్కేస్తాడు అని ముందు నుంచే అనుకున్నారు ఆడియన్స్. అనుకున్నట్టుగానే చెక్కేయడం కాదు.. ఢమాల్ పవన్‌ని కెప్టెన్సీ నుంచి పీకి పక్కనపెట్టారు.

న్యాయంగా గెలిచినా.. అన్యాయంగా గెలిచినా.. ఇప్పటి వరకూ బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో కెప్టెన్ అయిన వాళ్లని తొలగించిన సందర్భాలు లేవు. అసలు కెప్టెన్ కావడానికే పెద్ద సమరం నడుస్తుంటుంది హౌస్‌లో. అయితే ప్రతివారం కూడా ఎవరికి వాళ్లు ఆడి గెలిస్తే గొడవే ఉండదు. కానీ.. బిగ్ బాస్ హౌస్‌లో ఉండే పెద్ద పెంట యవ్వారం ఏంటంటే.. అక్కడ కెప్టెన్ అవ్వాలంటే గొప్పగా ఆడితే సరిపోదు. హౌస్‌లో సపోర్ట్ ఉండాలి. ముఖ్యంగా.. ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఉంటుందో.. దానికో పనికిమాలినోడ్ని సంచాలక్‌గా పెడతారు. వాడు కష్టపడినోడ్ని మానేసి.. వాడికి ఎవడు ఇష్టమో వాళ్లని కెప్టెన్‌ని చేస్తుంటాడు. చాలా సందర్భాల్లో అదే జరిగింది

కానీ ఈరెండోవారం డీమాన్ పవన్ కెప్టెన్ అయిన తీరు చూస్తే.. ఛీ ఛీ.. నీదీ ఓ గెలుపేనరా అంటూ మొహాన ఉమ్మేసేట్టుగా ఉంది. అతని మొహంపైనే కాదు.. అతన్ని కెప్టెన్‌ని చేసిన రీతూ మొహాన్నైతే రెట్టింపు ఉమ్మేసేలా ప్రవర్తించింది. ఏదో ఏళ్లకి ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్టుగా తపించిపోతున్న డీమాన్ పవర్, రీతూ చౌదరిలు బిగ్ బాస్ హౌస్‌ని లవర్స్ పార్క్‌లా మార్చేసి తెగ రుద్దేసుకుంటున్నారు. ఇక డీమాన్ పవన్‌ని ఎలాగైనా కెప్టెన్‌ని చేయాలని తహతహలాడిపోయిన రీతూ చౌదరి.. సంచాలక్‌గా తనకి ఇచ్చిన బాధ్యతల్ని పక్కన పెట్టేసి.. ప్రియుడ్ని గెలిపించి.. డీమాన్ పవన్‌ని కెప్టెన్‌ని చేసింది.

గెలవడం ముఖ్యం కాదు.. ఎలా గెలచాం అన్నదీ ముఖ్యమే కాబట్టి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్‌లు దిగజారుడ్ని ఎండగట్టి.. డీమాన్ పవన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి సంచలన నిర్ణయం తీసుకున్నారు హోస్ట్ నాగార్జున. రంగుపడుద్ది అని ముందే చెప్పిన నాగార్జున.. హౌస్‌కి కెప్టెన్ అయిన డీమాన్ పవన్ కెప్టెన్సీకి అర్హుడా కాదా? అతని గెలిచిన తీరు కరెక్టేనా? అని అడిగారు. ఆ తరువాత వీడియోలు చూపించి మరీ చెక్కుడు స్టార్ట్ చేశారు. లవర్స్ ఇద్దరూ.. రీతూ చౌదరి, డీమాన్ పక్క పక్కనే కూర్చుని.. ‘నువ్వు నాకోసం కెప్టెన్ అవుతావు కదా అని రీతూ.. అవుతానని డీమాన్.. ఇద్దరూ అనుకున్న మాటల్ని వీడియోలు చూపించారు.

పవన్ పేరు పుష్ చేసింది నువ్వే కదా అని నాగార్జున రీతూని అడిగితే.. హా నేనే సార్ అని ఒప్పుకుంది. స్టాప్ అన్న తరువాత కూడా కెప్టెన్సీ రేస్‌లో ఉన్న భరణిని కావాలనే ఎలిమినేట్ చేశావ్.. పవన్‌ని కెప్టెన్ చేయడం కోసం అంటూ మరో వీడియో చూపించారు నాగార్జున. తనూజ, సంజనా చెప్తున్నా కూడా వినలేదు.. మొదటి నుంచి పవన్ కెప్టెన్ కావాలని అనుకున్నావ్.. చేశావ్.. ఇది కరెక్ట్ కాదు కాబట్టి.. నీ కెప్టెన్సీని రద్దు చేస్తున్నా అంటూ ఢమాల్ పవన్ కెప్టెన్సీ బ్యాడ్జ్‌ని పీకేసి అతని కెప్టెన్సీ రద్దు చేశారు నాగార్జున.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *