Bigg Boss 7 Telugu : సరే సర్లే ఇప్పుడు ఎన్ని చెప్పినా వేస్ట్.. దామినిపై శివాజీ కామెంట్స్

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7లో మూడోవారం ఇంకో కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయింది. వెళ్తూ.. వెళ్తూ.. కంటెస్టెంట్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
బిగ్ బాస్ 7 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ కావడంతో కాస్త ఆసక్తిని పెంచింది. నాగర్జున కూడా కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించారు. హౌస్ లో సభ్యులు ఎలాంటి వారో చెప్పే ఆటను మెుదలుపెట్టారు. కలర్ వీల్ తిప్పుతూ.. కలర్ కోడ్ లో ఉన్న ప్రశ్నలు అడిగారు. ఒక్కొక్క కంటెస్టెంట్ మరో కంటెస్టెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. హౌస్ లో కన్నింగ్ కంటెస్టెంట్ ఎవరని అడగగా శోభా పల్లవి ప్రశాంత్ పేరు చెప్పింది. అతడు నామినేషన్స్ రోజు మాత్రమే చాలా అగ్రసివ్ గా మిగతా రోజుల్లు నార్మల్ గా ఉంటున్నాడని తెలిపింది.
ప్రశాంత్ వంతు వచ్చినప్పుడు తన ఆటకోసం శోభా శెట్టి అందరినీ వాడుకుంటుందని చెప్పాడు. హౌస్ లో తేనె పూసిన కత్తి ఎవరిని నాగ్ దామినిని ప్రశ్నించగా.. సందీప్ పేరు చెప్పింది. చెప్పాల్సిన విషయం చాలా సున్నితంగా చెబుతారని, వినకుంటే ఒరిజినాలిటీ బయటకు వస్తుందని దామిని తెలిపింది. ఇంట్లో నెగిటివిటీ ఎవరు స్ర్పెడ్ చేస్తారని సందీప్ ను అడగ్గా.. యావర్ పేరు చెప్పాడు. బ్యాక్ బిచింగ్ చేసే దాంట్లో రతిక ఉంటుందని యావర్ చెప్పుకొచ్చాడు. ఇలా ఒక్కొ కంటెస్టెంట్ ఒక్కో విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు.
ఇక తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లో ఆదివారం హౌస్ నుంచి దామిని ఎలిమినేట్ అయింది. అంతకుముందు నామినేషన్స్ లో చివరిదాకా అమర్ దీప్, శుభ శ్రీ, దామిని వచ్చారు. ఫైనల్ గా నామినేషన్స్ లో శుభ శ్రీ, దామిని ఉన్నారు. కన్ఫెషన్ రూములోకి వెళ్లాక.. దామిని పేరును బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.
దామిని బయటకు వచ్చిన తర్వాత బెలూన్ పగలగొట్టి కంటెస్టెంట్లకు సలహాలు, సూచనలు ఇవ్వమని అడిగాడు నాగ్. ఈ సందర్భంగా కంటెస్టెంట్లపై ఆసక్తికర కామెంట్స్ చేసింది దామిని. ప్రియాంకను ఇంకా బాగా ఆడమని ఎంకరేజ్ చేసింది. శివాజీ, దామిని మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. దామిని జర్నీ చూపిస్తున్న సమయంలో శివాజీ చెప్పిన మాటలను గుర్తు చేసింది. నేను సేఫ్ గేమ్ ఆడలేదని పేర్కొంది. నువ్ సేఫ్ గేమ్ ఆడుతున్నావని నేను అనలేదని శివాజీ బదులిచ్చాడు. నీ గేమ్ నువ్వు ఆడలేదని అన్నట్టుగా ఉన్నానని తెలిపాడు. ఫస్ట్ వీక్ మాత్రమే ఆడావని, నీ ఫ్రెండ్స్ ను బయటకు వెళ్లిన తర్వాత అడగమని చెప్పాడు.
హౌస్ లో మీరు ఫేవరిజమ్ చూపిస్తున్నారని దామిని చెప్పగా.. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా వర్కవుట్ కాదు.. ఇంటికి వెళ్లి మీ ఫ్రెండ్స్ తో అడగండని మరోసారి అంటాడు శివాజీ. నేను మాట్లాడింది.. తప్పు అయితే నా మాటలు వెనక్కు తీసుకుంటానని చెప్పాడు. దీంతో దామిని సైలెంట్ అయిపోతుంది. తర్వాత హౌస్ నుంచి వెళ్లిపోయింది. ఇప్పటి వరకూ ముగ్గురు లేడి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మెుదట కిరణ్ రాథోడ్, తర్వాత షర్మిల, తాజాగా దామిని ఎలిమినేట్ వెళ్లిపోయింది.