మాజీ మంత్రి రోజాకు ఊహించని షాక్.. ఆ పదవి కూడా పోయింది
Puttur Municipal Chairman Anangi Hari Removed From Post: మాజీ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ ఆనంగి హరిని పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయన కుల ధ్రువీకరణ పత్రం విషయంలో విచారణ జరిపి.. ఆనంగి హరిని పదవి నుంచి తొలగించారు.
హైలైట్:
మాజీ మంత్రి రోజాకు నగిరలో షాక్
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ తొలగింపు
కుల ధ్రువీకరణ పత్రం విషయంలో
Puttur Municipal Chairman
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ హరి తొలగింపు
మాజీ మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్, వైఎస్సార్సీపీ నేత ఆనంగి హరిని పదవి పోయింది. హరిని మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు.. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హరి క్రెస్తవ మతంలోకి మారారు.. ఆ సమయంలో ఆయన బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం కూడా తీసుకున్నారు. అయితే 2014లో హరి కో-ఆప్షన్ సభ్యుడయ్యారు.. ఆయనకు క్రిస్టియన్ మైనారిటీ కోటాలో ఈ పదవి దక్కింది.
హరి 2019 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీలో చేరి.. 2020లో తాను ఎస్సీగా పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఆయన ఎస్సీ కుల ధ్రువీకరణపత్రం కూడా తీసుకున్నారు. 2021లో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.. అయితే పుత్తూరు మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ కావడంతో.. ఆయన ఆ ధ్రుపవత్రం ఆధారంగా తాను ఎస్సీనని పేర్కొని ఎన్నికల్లో పోటీచేసి కౌన్సిలర్‌గా గెలిచారు. అనంతరం పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి కూడా దక్కింది. 2021 నుంచి మొన్నటి వరకు ఆ పదవిలో కొనసాగారు.
అయితే హరి కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారం నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌కు తెలిసింది. గతేడాది జూన్ 9న ఎమ్మెల్యే మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హరి వ్యవహారంపై అనంతపురం ఆర్డీని విచారణాధికారిగా కూడా నియమించారు. అటు పుత్తూరు తహసీల్దారు కూడా ఈ కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారంపై ఆరా తీశారు. చివరికి హరి అక్రమంగా కుల ధ్రువీకరణపత్రం పొందారని అధికారులు తేల్చారు. ఈ క్రమంలో తాజాగా హరిని మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు. అయితే హరి మాత్రం రాజకీయకక్ష సాధింపుతోనే తనపై ఫిర్యాదు చేశారని ఆరోపించారు. కానీ ఆయన దీనికి అందుకు సంబంధించిన ఆధారాలేవీ సమర్పించలేదు. ఈ క్రమంలోనే పదవిని పోగొట్టుకున్నారు. మాజీ మంత్రి రోజా సొంత నియోజకవర్గం పరిధిలోని పుత్తూరు మున్సిపాలిటీలో ఛైర్మన్ పదవి కావడంతో ఈ అంశం హాట్‌టాపిక్ అయ్యింది.