Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి సరుకులు.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్.. రాష్ట్రవ్యాప్తంగా లాంచ్..!

 Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి సరుకులు.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్.. రాష్ట్రవ్యాప్తంగా లాంచ్..!

Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి సరుకులు.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్.. రాష్ట్రవ్యాప్తంగా లాంచ్..!
ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. స్థానిక రైతుల బజార్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లు ఇంటికి డోర్ డెలివరీ చేయనుంది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికే డెలివరీ చేయనుంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించనుంది.
Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి సరుకులు.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్.. రాష్ట్రవ్యాప్తంగా లాంచ్..!

ఇంట్లోకి అవసరమయ్యే కూరగాయలు, పండ్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే ఇంటికే వచ్చేస్తున్నాయి. ఇందుకోసం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ లాంటి అనేక యాప్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ఆర్డర్ చేస్తే దగ్గర్లోని స్టోర్స్ నుంచి కేవలం 10 నిమిషాల్లోనే మీ ఇంటికి నిత్యావసర సరుకులన్నీ వచ్చేస్తున్నాయి. ఇవి ప్రైవేట్ కంపెనీల యాప్స్ కాగా.. వీటిల్లో ధరలు అధికంగా ఉంటున్నాయి. ఇక మెయింటెన్స్ ఛార్జీలు ముక్కుపిండి కస్టమర్ల గురించి వసూలు చేస్తున్నాయి ఈ క్విక్ కామర్స్ యాప్స్. కేవలం మెట్రో సిటీలలోనే కాకుండా ఇటీవల పట్టణాల్లో కూడా ఇవి సేవలు అందిస్తున్నాయి. కేవలం నిమిషాల్లోనే ఇంటికే సరుకులన్నీ డోర్ డెలివరీ వస్తుండటంతో వీటికి జనాలు తెగ అలవాటు పడిపోయారు.

ఏపీ ప్రభుత్వం కొత్త యాప్
అయితే ప్రైవేట్ యాప్స్‌తో సంబంధం లేకుండా ఏపీ ప్రభుత్వం సరికొత్త వెబ్‌సైట్, యాప్ ప్రారంభించింది. డిజీ రైతు బజార్ పేరుతో యాప్, పోర్టల్ లాంచ్ చేసింది. వీటి ద్వారా తక్కువ ధరకే కూరగాయలు, పండ్లను స్థానిక రైతు బజార్ల ద్వారా ప్రజలకు డోర్ డెలివరీ చేస్తుంది. మీరు ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే నేరుగా ఇంటికే నిత్యావసర సరుకులను డెలివరీ చేస్తోంది. స్థానిక రైతు బజార్లలో ఎంత ధరలు ఉన్నాయే అవే ధరలు మీకు వర్తిస్తాయి. దీని వల్ల అత్యంత తక్కువ ధరకే నాణ్యమైన, తాజా కూరగాయాలు, పండ్లు నేరుగా మీ ఇంటికే వచ్చేస్తాయి. అంతేకాకుండా ఆన్‌లైన్‌లోనే మీరు పేమెంట్ చేసే సౌకర్యం కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని కొన్ని రైతు బజార్ల ద్వారా 5 కిలోమీటర్లలోపు ప్రజలకు ఈ సేవలు అందిస్తోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తుండగా.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించనున్నారు.

యాప్ ఎలా వాడాలి..?
–https://digirythubazaarap.com వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లండి -మీ మొబైల్ నెంబర్‌, ఈమెయిల్, మీ పేరు, పాస్‌వర్డ్ నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి -ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, పాస్ వర్డ్‌తో లాగిన్ అవ్వండి -లొకేషన్ పర్మిషన్ ఇస్తే మీ దగ్గరల్లోని రైతు బజార్లు కనిపిస్తాయి -రైతు బజార్లను సెలక్ట్ చేసుకోండి -మీకు కావాల్సిన సరుకులను సెలక్ట్ చేసుకుని కార్ట్‌లో యాడ్ చేసుకోండి -మీ అడ్రస్ వివరాలను ఎంటర్ చేయండి -ఆ తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ లేదా క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకోండి -పేమెంట్ చేశాక ప్లేస్ ఆర్డర్‌పై క్లిక్ చేయండి -కొన్ని నిమిషాల్లోనే రైతు బజార్ నుంచి మీకు డోర్ డెలివరీ చేస్తారు

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *