డిప్యూటీ సీఎం తనయుడు అకీరా నందన్‌పై AI డీప్‌ఫేక్‌ వీడియో.. నిందితుడు అరెస్ట్

 డిప్యూటీ సీఎం తనయుడు అకీరా నందన్‌పై AI డీప్‌ఫేక్‌ వీడియో.. నిందితుడు అరెస్ట్

ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌ లక్ష్యంగా చేసుకుని తయారు చేసిన ఏఐ (AI) ఆధారిత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ కావడంతో రంగంలోకి దిగిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్‌ చేసి కటకటాల్లో వేశారు. అకీరా నందన్ పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌ లక్ష్యంగా చేసుకుని తయారు చేసిన ఏఐ (AI) ఆధారిత వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ కావడంతో రంగంలోకి దిగిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్‌ చేసి కటకటాల్లో వేశారు. అకీరా నందన్ పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్‌ చేసి జైల్లో వేశారు. సీఐ బిపెద్దిరాజు తెలిపిన వివరాల ప్రకారం..

మరోవైపు దీనిపై అకీరానందన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన ప్రతిష్ఠ, వ్యక్తిగత గోప్యత, భద్రతకు భంగం కలుగుతోందని.. తన పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తయారు చేయకుండా నిలువరించేందుకు ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్‌లో కోరారు. అలాగే తన పేరు, వ్యక్తిగత చిత్రాలను దుర్వినియోగం చేయకుండా సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. దీంతో ఈ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *