AP Inter Hall Tickets 2026: ఇంటర్మీడియట్‌ హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

 AP Inter Hall Tickets 2026: ఇంటర్మీడియట్‌ హాల్‌ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు..

అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు.

మరోవైపు ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలోనే నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ విద్యా మండలి అన్ని జూనియర్ కాలేజీలను ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్‌ జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు బోర్డు సూచించింది. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఈ సీసీ కెమెరాలను బోర్డులోని కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. ప్రాక్టికల్స్‌లో అవకతవకల కట్టడికి ఈ మేరకు ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. కాగా ఈ ఏడాది ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఆయా తేదీల్లో జరగనున్నాయి.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *