రాశిఫలాలు 23 జనవరి 2026:ఈరోజు గజకేసరి యోగం వేళ మిథునం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు..!

 రాశిఫలాలు 23 జనవరి 2026:ఈరోజు గజకేసరి యోగం వేళ మిథునం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు..!

horoscope today 23 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రావణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో వసంత పంచమి పండుగ వేళ గజకేసరి యోగం ఏర్పడనుంది. అంతేకాదు లక్ష్మీనారాయణ యోగం, రవి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు లక్ష్మీనారాయణుడి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. వసంత పంచమి కారణంగా ఈరోజు కొత్త పని ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే పనుల్లో మంచి పురోగతి సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని శుభవార్తలు వింటారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతీ దేవి ముందు పుస్తకాలను ఉంచి పూజలు చేయాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఈరోజు మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయాలు సాధిస్తారు. మీ ఇంట్లో వాతావారణం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు.

ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడిని పూజించాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ తండ్రి మద్దతు నుంచి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం మెరుగవుతుంది.

ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేయాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఈ కాలంలో మీరు ఊహించని లాభాలు పొందే అవకాశాలున్నాయి. విదేశాలలో పని చేసే వ్యక్తులు మంచి విజయాలు సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు ప్రజాదరణ పెరుగుతుంది. మీకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు తలెత్తొచ్చు.

ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతీ పూజకు పసుపు బియ్యం సమర్పించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారు ఈరోజు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా గందరగోళ పరిస్థితులు ఏర్పడితే సీనియర్ల సలహా తీసుకోవాలి. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈరోజు కొత్త వాహనం కొనేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ పిల్లల కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు వింటారు. మీకు పని ఒత్తిడి తగ్గుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. వ్యాపారులు మెరుగైన లాభాలు కలగనున్నాయి. మీ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడిని పూజించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. విద్యార్థులు తాము చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక ప్రణాళికలు కూడా విజయవంతం అవుతాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి.

ఈరోజు మీకు 94 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించి, విద్యార్థులకు స్వీట్లు దానం చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు ఆస్తి ప్రయోజనాల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. మీకు తల్లి వైపు నుంచి అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీ బంధువుల సాయంతో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు సీనియర్ అధికారుల మద్దతుతో, ముందుకు సాగుతూనే ఉంటారు. మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.

ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సరస్వతీ దేవికి పసుపు పువ్వులు సమర్పించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఈరోజు అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలి. ఈరోజు మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ పిల్లల ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. మీరు చేసే పనులన్నీ మంచి విజయం సాధించొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు బంధువులతో సంతోషంగా గడుపుతారు. వారితో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *