Khairatabad Ganesh: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం – Exclusive Photos
ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అశేష జనవాహిని మధ్య శోభాయాత్ర ట్యాంక్ బండ్‌కు చేరింది. క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం నిర్వహించారు. వేలాది మంది భక్తులు జై గణేశా, జై జై గణేశా అంటూ నినాదాలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు.
ఖైరతాబాద్ గణేష్ విగ్రహం హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ, ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.
ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహం ఎత్తును ఒక అడుగు పెంచుతూ వచ్చారు.
అయితే, కొన్ని సంవత్సరాల నుంచి ఎత్తు 60 అడుగులకు పరిమితం చేశారు.
ఈ ఏడాది 69 అడుగుల మహా గణనాధుని విగ్రహం ప్రత్యక్షమైంది.
కాగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రతి సంవత్సరం కొత్త రూపంలో దర్శనమిస్తుంది.
ఒక్కోసారి పంచముఖ గణపతిగా, ఇంకోసారి ద్వాదశ ఆదిత్య గణపతిగా, మరికొన్నిసార్లు ఇతర రూపాల్లో ఆవిష్కరిస్తారు.
ఇవాళ ఆ 69 అడుగుల మహా గణపతి ప్రకృతి ఒడిలో గంగమ్మ ఒడికి చేరాడు.
హైదరాబాద్‌లోని సాగరతీరంలో ఆ మహా గణనాధుడ్ని అనుకున్న సమయానికే నిమజ్జనం చేశారు.
పోలీసులు, ఇతర సిబ్బందితో భారీ బందోబస్తు మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లతోని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.
క్రేన్ నెంబర్ 4 వద్ద బడా గణేష్ నిమజ్జనం జరిగింది.
ఆ సమయంలో ట్యాంక్ బండ్ దగ్గరకు భక్తులు, ప్రజలు, యువతీ యువకులు చేరుకుని తలపించారు.
ఈ బడా గణేష్ నిమజ్జనానికి భక్తులు భారీగా తరలొచ్చారు.