Nayantara: నయనతార పెళ్లి రోజు స్పెషల్.. కార్గో బైక్ లో భార్యతో కలిసి జాలీ రైడ్ ! (వీడియో వైరల్)

విగ్నేష్ శివన్ తమ పెళ్లిరోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భార్య నయన్, ఇద్దరి పిల్లల్ని తీసుకొని కార్గో బైక్ లో జాలీగా రైడ్ కి వెళ్లారు. విగ్నేష్ బైక్ నడుపుతుంటే నయన్ వీడియో తీయడం ఎంతో క్యూట్ గా కనిపించింది.
లేడీ సూపర్ స్టార్ నయనతార – విగ్నేష్ శివన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి మూడు సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు మూడవ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నయన్- విగ్నేష్ సోషల్ మీడియాలో తమకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ.. ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తపరిచారు
కార్గో బైక్ రైడ్
ఇందులో విగ్నేష్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో విగ్నేష్ .. భార్య, తమ ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలాగ్ తో కలిసి కార్గో బైక్ లో జాలీగా రైడ్ కి వెళ్లారు. విగ్నేష్ బైక్ నడుపుతుంటే నయన్ భర్తను వీడియో తీయడం ఎంతో క్యూట్ గా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నయనతారా అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఫీమెల్ లీడ్ గా నటిస్తోంది. ఇటీవలే మంచి ప్రమోషనల్ వీడియోతో నయన్ కి వెల్కమ్ చెప్పారు మేకర్స్ . గాడ్ ఫాదర్,సైరా నరసింహా రెడ్డి తర్వాత నయన్ – మెగాస్టార్ కాంబోలో రాబోతున్న మూడవ సినిమా ఇది. ఇప్పటికే మొదలైన ఈ సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు టీమ్.