కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులు చేశారో.. దరిద్రమంతా మీ ఇంట్లోనే

 కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులు చేశారో.. దరిద్రమంతా మీ ఇంట్లోనే

కార్తీక పౌర్ణమి రోజు ఆహారం, ధాన్యాలు వంటివి దానం చేస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెండి, పాలు వంటి పదార్థాలను దానం చేయకూడదని, చేస్తే ఇంట్లోనే దరిద్రమంతా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చాలా మంది భక్తితో శివుడిని పూజిస్తారు. ముఖ్యంగా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే కార్తీక పౌర్ణమి రోజు తెలియక కొన్ని తప్పులు చేస్తే మీ జీవితమంతా దరిద్రంలోనే ఉంటుందని పండితులు చెబుతున్నారు.

కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి..

కార్తీక పౌర్ణమి రోజు ఆలస్యంగా నిద్రలేవకుండా వేకువ జామున నిద్రలేవాలని పండితులు సూచిస్తున్నారు. ఉదయాన్నే లేచి దామోదర పూజ ఆచరించి నదిలో దీపాలు వదలాలి. అలాగే భక్తితో శివుడిని, విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజు ఉపవాసం ఉండి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించాలి. అయితే కార్తీక పౌర్ణమి రోజు కొన్ని వస్తువులు దానం చేయాలి. కానీ కొందరికి తెలియక వెండి పాత్రలు, పాలను దానం చేస్తుంటారు. వీటిని దానం చేయడం వల్ల మంచి కాకుండా చెడు జరుగుతుందని పండితులు అంటున్నారు.

కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం, మద్యపానం, ధూమపానం వంటివి సేవించకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే ఇంట్లోనే దరిద్రమంతా ఉంటుదట. కార్తీక పౌర్ణమి రోజు పేదలకు ఆహారం, ధాన్యాలు వంటివి దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *