రాశిఫలాలు 25 జనవరి 2024: ఈరోజు పుష్య పౌర్ణమి వేళ మూడు శుభ యోగాలు.. ఈ 3 రాశులకు విశేష లాభాలు..!

 రాశిఫలాలు 25 జనవరి 2024: ఈరోజు పుష్య పౌర్ణమి వేళ మూడు శుభ యోగాలు.. ఈ 3 రాశులకు విశేష లాభాలు..!

రాశిఫలాలు 25 జనవరి 2024: ఈరోజు పుష్య పౌర్ణమి వేళ మూడు శుభ యోగాలు.. ఈ 3 రాశులకు విశేష లాభాలు..!

horoscope today 25 January 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు పుష్య పౌర్ణమి వేళ మూడు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…

రాశిఫలాలు 25 జనవరి 2024: ఈరోజు పుష్య పౌర్ణమి వేళ మూడు శుభ యోగాలు.. ఈ 3 రాశులకు విశేష లాభాలు..!
horoscope today 25 January 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గురు పుష్య యోగం, సర్వార్ధ సిద్ధి యోగం, రవి యోగం ఏర్పడనున్నాయి. ఈ సమయంలో వృషభం, మిధునం, వృశ్చికంతో సహా ఈ రాశులకు లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభించనుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం
  • మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు తమ భాగస్వామి నుండి సకాలంలో మద్దతు పొందుతారు. శాశ్వత ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా భారీ లాభాలను పొందొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో సబార్డినేట్‌ల నుండి మద్దతు పొందొచ్చు. మీ వ్యాపారం బాగా సాగుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు రావొచ్చు. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, దాన్ని కచ్చితంగా చేయాలి. మీరు మంచి విజయాలు పొందుతారు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి.

​వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని, ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈరోజు వాహనాలు, యంత్రాల వినియోగంలో అజాగ్రత్తగా ఉండొద్దు. చిన్న పొరపాటు మీ సమస్యను మరింత పెంచుతుంది. మీ వ్యాపారం బాగా సాగుతుంది. మీరు స్నేహితులు, బంధువుల నుండి సహాయం పొందుతారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకండి.

ఈరోజు మీకు 76 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. మీ ఖర్చులను నియంత్రించండి లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ వ్యాపారంలో క్షీణత ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో విభేదాలు ఉండొచ్చు. భాగస్వాముల మధ్య విభేదాలు రావచ్చు. మీరు అనుకున్న పనుల్లో అడ్డంకులు ఎదురుకావొచ్చు. మీరు జీవితంలోని వివిధ రంగాలలో తెలివితేటల ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. మీ ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకోవడంలో విజయం సాధించగలరు. కొత్త ప్రణాళికలపై పని చేయొచ్చు.

ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు తమ మనసును అదుపులో పెట్టుకోవాలి. మీకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత పరిస్థితి చక్కబడుతుంది. మీ భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. తొందరపాటు వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ప్రశాంతత ఉంటుంది. మీ పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీ ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. ఈరోజు మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. కొన్ని కారణాల వల్ల మీ మనసు కలత చెందుతుంది.

ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శని దేవుడిని దర్శించుకుని తైలం సమర్పించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు తమ ఉత్సాహాన్ని అదుపు చేసుకునే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. మీ వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. మీకు ఊహించని లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీకు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీ వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరగొచ్చు. జూదం, బెట్టింగ్, లాటరీల ఉచ్చులో పడకండి. మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. సామాజిక రంగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు కొత్త ప్లాన్ వేసే అవకాశం ఉంది. మీ పనితీరులో మెరుగుదల ఉంటుంది. సామాజిక సేవ చేయాలనే కోరిక మేల్కొంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు మంచి ఫలితాలొస్తాయి. మీ ఆదాయ వనరులు పెరగొచ్చు. మీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడులకు మంచి ఫలితాలొస్తాయి. మీ ఇంట్లో సహకారం, సంతోషం పెరగొచ్చు. ఈ రోజు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రం’ పఠించాలి.

తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. కొన్ని పెద్ద పనుల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు స్నేహితుల నుండి మద్దతు పొందే అవకాశం ఉంది. మీ అప్పులు తగ్గి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీ కోరిక మేరకు వ్యాపారం సాగుతుంది. మీ ప్రభావాన్ని పెంచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలత ఉంటుంది. మీ పెట్టుబడులకు మంచి ఫలితాలొస్తాయి. మీరు ఏదైనా దేవాలయానికి లేదా మతపరమైన ప్రదేశాలకు వెళ్లొచ్చు. వినోద కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చులొస్తాయి. మీ కుటుంబ జీవితంలో పరస్పర సమన్వయం పెరుగుతుంది.

ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి.

వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో ఉద్యోగులకు సహోద్యోగులు సహకరిస్తారు. వ్యాపారులు తొందరపడకండి. గాయం, ప్రమాదాలను నివారించాలి. మీకు లాభదాయకమైన అవకాశాలొస్తాయి. మీ ఇంటి బయట పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు స్వల్ప దూరం ప్రయాణించే అవకాశం ఉంది. మీరు ఆలోచనాత్మకంగా వ్యవహరించాలి. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు వివేకం, విచక్షణను ఉపయోగించాలి.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి లోపలా, బయటా అశాంతి ఉంటుంది. మీ పనిలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగులకు ఆదాయం, పనిభారం తగ్గుతాయి. మరోవైపు మీకు ఎలాంటి కారణాలు లేకుండా కొందరితో వివాదాలు రావొచ్చు. విచారకరమైన వార్తలను స్వీకరించడం వల్ల ప్రతికూలత పెరుగుతుంది. వ్యాపారులకు సంతృప్తి లభించదు. భాగస్వాముల మధ్య విభేదాలు ఉండొచ్చు. ఏ పనిలోనూ తొందరపడకండి. సన్నిహితులను కలవడం ద్వారా మీరు సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రాత్రి నల్ల కుక్కకు రోటీ తినిపించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చేసే యాత్రలు విజయవంతమవుతాయి. ఈరోజు మీకు కంటికి సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ బకాయిలు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ వ్యాపార ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీరు రిస్క్ తీసుకోవడానికి ధైర్యాన్ని కూడగట్టుకోవచ్చు. కొన్ని విషయాల గురించి తెలియని భయం, ఆందోళన ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

ఈరోజు మీకు 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. మేధోపరమైన పని విజయవంతమవుతుంది. మీరు జ్ఞానోదయం పొందిన వ్యక్తి నుండి మార్గదర్శకత్వం పొందొచ్చు. మీ ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మీ ప్రసంగాన్ని నియంత్రించండి. సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. మీరు చేసే ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. మొత్తంమీద ఈరోజు శుభప్రదంగా ఉంటుంది.

ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు మానసిక ప్రశాంతతను పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు కిందిస్థాయి అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు కొన్ని సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని పొందవచ్చు. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి. వీలైతే, ఈరోజు ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయండి. మీ వాహనాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. దుర్గా మాతను దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సూర్య నారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *