నేటి రాశి ఫలాలు 25.12.2023: దగ్గరి వారితో విభేదాలు వస్తాయి జాగ్రత్త
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.12.2023 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
వారం: సోమవారం, తిథి: శు. చతుర్దశి,
నక్షత్రం: రోహిణి, మాసం: మార్గశిరం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
మేషరాశి ఫలాలు
మేషరాశి వారికి ఈ రోజు ముఖ్య కార్యాల్లో శుభఫలితాలుంటాయి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. పట్టుదల అవసరం. ఏ విషయంలోనూ తొందరపడవద్దు. సన్నిహితుల సూచనలు పనిచేస్తాయి. చంచల నిర్ణయాలతో కాలం వృథా కాకుండా జాగ్రత్తపడాలి. వ్యాపారంలో విఘ్నాలు తొలగుతాయి. రుణసమస్యలు పెరగవచ్చు. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. శుభం జరుగుతుంది. మేషరాశివారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు.
వృషభ రాశి ఫలితాలు
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కాలం వృథా కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. మిత సంభాషణ మేలుచేస్తుంది. పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. విఘ్నాలను సమయస్ఫూర్తిగా అధిగమించాలి. నూతన ప్రయోగాలకు సమయం కాదు. ఏకాగ్రత పెంచాలి. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.
మిథునరాశి ఫలితాలు
మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరే అవకాశం ఉంది. తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలుంటాయి. సకాలంలో బాధ్యతలను పూర్తిచేయండి. ఓర్పు శక్తినిస్తుంది. ఆలోచించి తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది. చెడు ఊహించవద్దు. ఒక సమస్య పరిష్కారమవుతుంది. న్యాయం మీ పక్షాన నిలుస్తుంది. శుభవార్త వింటారు. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.
కర్కాటక రాశి ఫలాలు
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అద్భుతమైన ఫలితాలుంటాయి. ఉద్యోగంలో విశేషమైన కీర్తి లభిస్తుంది. పదవీ లాభం సూచితం. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. పలువిధాలుగా అభివృద్ధిని సాధించగలరు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. ధన ధాన్యాభివృద్ధి ఉంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. కర్కాటకరాశి వారికి వారికి మరింత శు భఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.
సింహరాశి ఫలాలు
సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. నిజాయితీగా పనిచేసి పెద్దల్ని మెప్పిస్తారు. ఆర్థికంగా శుభకాలం. వ్యాపారంలో బాగుంటుంది. ఆవేశం పనికిరాదు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. స్పష్టంగా మాట్లాడాలి. సింహరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.
కన్యారాశి ఫలితాలు
కన్యారాశి వారికి ఈ రోజు మీకు వ్యాపారపరంగా కలసివచ్చును. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కీర్తిప్రతిష్టలు సాధిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు లాభాన్నిస్తాయి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఉద్యోగంలో కలసివస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశముంది. గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
తులా రాశి ఫలితాలు
తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మంచి ఆలోచనలతో నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. మనశ్శాంతి పెరుగుతుంది. న్యాయం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.
వృశ్చిక రాశి ఫలాలు
వృశ్చికరాశి వారికి ఈరోజు వ్యాపారపరంగా కలసివస్తుంది. విశేష ధనలాభం కలుగుతుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సకాలంలో మీ బాధ్యతలను పూర్తిచేయండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఎక్కడా నిరుత్సాహపడవద్దు. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. శుభవార్త వింటారు. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.
ధనుస్సు రాశి ఫలితాలు
ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. దేనికీ తొందరపడవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విజయం లభించేవరకూ కృషి చేయాలి. చెడు ఊహించవద్దు. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. అనుకూల ఫలితాలు చేకూరతాయి. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.
మకర రాశి ఫలితాలు
మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మనోబలంతో పనులు ప్రారంభించండి. నిరుత్సాహపరిచే పరిస్థితులున్నాయి. బుద్ధిబలంతో పరిష్కరించండి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ధర్మమార్గంలో కర్తవ్యాలను పూర్తిచేయడం ద్వారా మంచి జరుగుతుంది. తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. శాంతంగా పరిష్కరించాలి. పనులు వాయిదా వేయవద్దు. ఉత్సాహంగా ఉండండి. మకరరాశి వారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అష్టోతర శతనామావళి పఠించండి.
కుంభ రాశి ఫలితాలు
కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగంలో గొప్ప విజయాలున్నాయి. పదవీలాభం సూచితం. బంగారు భవిష్యత్తును అందుకుంటారు. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారంలో బాగుంటుంది. గుర్తింపు గౌరవం లభిస్తాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. గృహ వాహన యోగాలున్నాయి. స్థిరాస్తులు పెరుగుతాయి. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మీన రాశి ఫలాలు
మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగంలో పదోన్నతులున్నాయి. అధికార లాభముంది. ప్రతిభతో మెప్పించి పెద్దల ప్రశంసలు పొందుతారు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఎవరితోనూ విభేదించవద్దు. నిరంతర సాధనపై దృష్టి పెట్టండి. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.