ఈరోజు రాశి ఫలాలు అక్టోబరు 6, 2023 శుక్రవారం

 ఈరోజు రాశి ఫలాలు అక్టోబరు 6, 2023 శుక్రవారం

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు తేదీ 06 అక్టోబరు 2023 శుక్రవారం కోసం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

వారం: శుక్రవారం, తిథి: సప్తమి,

నక్షత్రం: ఆరుద్ర, మాసం: భాద్రపదం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

1.మేషరాశి ఫలాలు 2023

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తం నుండి అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఉద్యోగములో రాజకీయ ఒత్తిళ్ళు ఏర్పడును. అయినప్పటికి ప్రమోషన్లు లభించును. జన్మరాశి యందు గురురాహువుల ప్రభావంచేత, కళత్ర స్థానములో కేతువు ప్రభావంచేత కుటుంబములో సమస్యలు అధికముగా ఉండును. వాదోపవాదాలకు దూరంగా ఉండాలని సూచన. చతుర్ధ స్థానములో శుక్రుడు, దశమ స్థానములో బుధుని యొక్క అనుకూల ప్రభావంచేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత అభివృద్ధి కలుగును. ఈరోజు కృష్ణాష్టకం పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయి.

==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు ప్రమోషన్లు, కీర్తి లాభము కలుగును. వ్యాపారస్తులకు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. తృతీయ స్థానము నందు శుక్రుడు, చతుర్ధ స్థానమునందు బుధుని అనుకూల ప్రభావం వలన పనులయందు పురోగతి కనిపించును. ఉద్యోగస్తులకు అనుకూలం. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.

===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా లాభదాయకం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ధనలాభము కలుగును. స్త్రీలకు అనుకూలం. విద్యార్థులకు శుభ సమయం. కుటుంబమునందు సౌఖ్యం, ఆనందము కలుగును. శుక్రుడు, చతుర్ధ స్థానం నందు బుధుని అనుకూల ప్రభావం వలన పనులయందు పురోగతి కనిపించును. దశమంలో శని ప్రభావం వలన ఉద్యోగస్తులకు అనుకూలం. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023

కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. అష్టమశని ప్రభావం వలన ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచన. రవి, కుజులు తృతీయంలో అనుకూలించుట వలన కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు మధ్యస్థం. వ్యాపారంలో చికాకులు అధికముగా ఉండును. స్త్రీలు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వలన ఇబ్బందులు ఏర్పడును. రైతాంగానికి అంత అనుకూలంగా లేదు. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

==========================================================================
సింహరాశి ఫలాలు 2023

సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సౌఖ్యం, ఆనందము. సినీరంగంవారికి మధ్యస్థం. జన్మరాశియందు బుధుని ప్రభావం, వ్యయస్థానమునందు శుక్రుని ప్రభావంచేత ఒత్తిళ్ళకు గురి అవుతారు. వ్యసనాల కోసం, సుఖ సౌఖ్యాల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. వాక్‌ స్థానములో రవి, కుజుల ప్రభావంచేత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే స్థితి ఏర్పడును. మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను భగవంతునికి నివేదన చేయండి.

============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023

కన్యారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యయస్థానములో బుధుని ప్రభావంచేత వ్యాపారం కోసం, సౌఖ్యం కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. లాభస్థానములో శుక్రుని ప్రభావం వలన ధనపరమైనటువంటి విషయాల్లో లాభాన్ని పొందెదరు. అనారోగ్య సూచనలు, కుటుంబంనందు సమస్యలు అధికముగా ఉండు సూచన. వ్యాపారస్తులకు లాభదాయకం. విద్యార్థులకు మధ్యస్థ సమయం. రైతాంగానికి అంత అనుకూలంగా లేదు. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.c
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీయొక్క శక్తి తెలివితేటలతో విజయం వైపుకు దూసుకు పోవుదురు. అనారోగ్య సమస్యలు ఏర్పడును. విద్యార్థులకు మధ్యస్థం. మానసిక ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు అధికముగా ఉండును. లాభస్థానములో రవి కుజులు ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలసివచ్చును. దశమస్థానములో బుధుని ప్రభావం వలన అనుకూల ఫలితాలున్నాయి. భాగ్యస్థానములో శుక్రునిప్రభావంచేత కుటుంబ సౌఖ్యం కలుగును. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. ఎన్ని సమస్యలు ఏర్పడినప్పటికి మీయొక్క శక్తి తెలివితేటలతో విజయం వైపుకు దూసుకు పోవుదురు. అనారోగ్య సమస్యలు ఏర్పడును. విద్యార్థులకు మధ్యస్థం. మానసిక ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు అధికముగా ఉండును. లాభస్థానములో రవి కుజులు ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలసివచ్చును. దశమస్థానములో బుధుని ప్రభావం వలన అనుకూల ఫలితాలున్నాయి. భాగ్యస్థానములో శుక్రునిప్రభావంచేత కుటుంబ సౌఖ్యం కలుగును. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
====================================================================================

9.ధనుస్సు రాశి ఫలాలు 2023

ధనూరాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. తృతీయంలో శని ప్రభావం వలన సౌఖ్యం, ఆనందము పొందెదరు. పంచమంలో గురు, రాహువులు, లాభములో కేతువు ప్రభావం వలన కుటుంబ సౌఖ్యం పొందెదరు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. విదేశీ విద్యలు అనుకూలించును. ధనలాభము, వస్తులాభము మరియు సౌఖ్యం కలుగును. రైతాంగానికి అనుకూల సమయం. ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలంటే మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
======================================================================================

10.మకరం రాశి ఫలాలు 2023

మకర రాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచన. కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు పెరుగును. ఉద్యోగ ప్రయత్నములు సఫలీకృతమగును. ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికం. ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు. వ్యాపారంనందు అప్పులు చేయవలసిన స్థితి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. స్త్రీలకు కుటుంబ సమస్యలు వేధించును. ఈరోజు లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు క్షీరాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. లక్ష్మీస్తోత్రం పఠించండి.
=========================================================================================

11.కుంభం రాశి ఫలాలు 2023

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు రుణ బాధలు పెరుగును. ధనం సమయానికి చేతికి అందదు. అష్టమ శని రవి, బుధ, కుజుల యొక్క సంచారం వలన అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. వాక్‌ స్థానములో గురు, రాహువుల ప్రభావం చేత ఘర్షణ వాతావరణం ఏర్పడును. రైతాంగం, సినీరంగాల వారికి అనుకూలం. విద్యార్థులకు మధ్యస్థ సమయం. ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో లక్ష్మీదేవిని పూజించడం మరింత వల్ల శుభఫలితాలు కలుగుతాయి. పంచదార వెన్న కలిపి బాలకృష్ణునికి నివేదించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

======================================================================================

12.మీనం రాశి ఫలాలు 2023

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కలుగును. వాక్‌ స్థానమునందు గురు, రాహువుల ప్రభావం వలన గొడవలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. రైతాంగానికి మధ్యస్థం. కుటుంబము నందు సమస్యలు ఏర్పడును. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి. విష్ణు సహస్రనామం పఠించండి. అష్ట లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 94949 81000
==========================================================================================

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *