Rahul Sipligunj : పర్సనల్ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయి.. మాజీ లవర్ రతికను కడిగేసిన రాహుల్ సిప్లిగంజ్

 Rahul Sipligunj : పర్సనల్ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయి.. మాజీ లవర్ రతికను కడిగేసిన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj Rathika Rose: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍ ఉల్టా పుల్టా ఉండటమే కాదు.. అందులోని కంటెస్టెంట్ రతిక రోజ్ కూడా ఇంచుమించు అలానే ఉంది. తనతో బ్రేకప్ అయిందంటూ చేస్తున్న ప్రచారంపై తాజాగా మరోసారి కడిగేశాడు రాహుల్ సిప్లిగంజ్.
ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగులోకి పదో కంటెస్టెంట్‍గా అడుగు పెట్టిన బ్యూటిఫుల్ రతిక రోజ్ ప్రేమాయణం ఆసక్తికరంగా మారింది. హౌజ్‍లో మొదట పల్లవి ప్రశాంత్‍తో చనువుగా ఉండి.. నామినేషన్లో గట్టిగా దెబ్బ వేసింది. అలాగే ప్రిన్స్ యావర్‍కు సపోర్ట్ చేసినట్లు మాట్లాడి.. మూడో పవరాస్త్ర కంటెండర్‍కు అనర్హుడని ప్లేట్ తిప్పేసింది. దాన్ని ప్రిన్స్ క్షమించడంతో అతనితో కలిసి ఒకే ప్లేటులో రోటీ తింటూ రొమాన్స్ నడిపించింది రతిక.

ఇవే కాకుండా బిగ్ బాస్ హౌజ్‍లోకి రతిక ఎంట్రీ అయ్యాక.. సోషల్ మీడియాలో ఆమె, రాహుల్ క్లోజ్‍గా ఉన్న ఫొటోలు గింగిరాలు తిరిగాయి. దీంతో ఆమె ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‍లో తన బ్రేకప్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది రతిక రోజ్. ఇదంతా సింపతీ పొందడానికి అని, అంతా నటన అని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్‍ ఇన్ స్టా పోస్టుతో పరోక్షంగా చెప్పాడు. ఇప్పుడు మరోసారి తన పోస్టుతో రతికను కడిగేశాడు.

“నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఆరేళ్ల తర్వాత ఒకరి ఫోన్‍లో ఉన్న పర్సనల్ ఫొటోలు ఒక్కసారిగా బయటకు వచ్చి ఎలా ఇంటర్నెట్‍లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది వాళ్లు లోపలకి వెళ్లే ముందు ప్రీ ప్లాన్‍గా చేసిన పనేనా. గాయ్స్.. దీనికి మీరంతా ఆన్సర్ కనుక్కుని అసలు నిజాలు ఏంటో తెలుసుకోవాలి. నాకూ, మరొకరి జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ, ఫ్రెండ్ ఉంటారు. వాళ్లపై ఇలాంటివి తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విషయాన్ని వాళ్లు ఇది చేసే ముందు గ్రహించాలి” అని రాహుల్ పేర్కొన్నాడు.

రాహుల్ సిప్లిగంజ్ అదే స్టోరీలో కొనసాగిస్తూ.. “ప్రతి ఒక్కరి జీవితంలో గతం ఉంటుంది. అలాగే, ప్రజంట్ కూడా ఉంటుంది. కాబట్టి, అవగాహన లేకుండా ప్రతిదాన్ని జడ్జ్ చేయకండి. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్లకు థ్యాంక్స్. ఎవరైతే నెగెటివిటీని ప్రచారం చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఆల్ ది బెస్ట్” అని చెప్పుకొచ్చాడు. మొదటి స్టోరీలాగే రతిక పేరు తీయకుండా ఆమె పరువు తీశాడు రాహుల్ సిప్లిగంజ్.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *