Rasi Phalalu (19th sep 2023) | రోజువారీ రాశి ఫలాలు
డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య
1.మేషరాశి ఫలాలు 2023
అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి ఈ రోజు ఇంటా బయట పని ఒత్తిడులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. స్థిరస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023
మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి ఈ రోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023
పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి ఈ రోజు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
==========================================================================
సింహరాశి ఫలాలు 2023
మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి ఈ రోజు దూరపు బంధువులు కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి ఈ రోజు ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023
విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి ఈ రోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
====================================================================================
9.ధనుస్సు రాశి ఫలాలు 2023
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి ఈ రోజు కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
======================================================================================
10.మకరం రాశి ఫలాలు 2023
ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి ఈ రోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
=========================================================================================
11.కుంభం రాశి ఫలాలు 2023
ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి ఈ రోజు ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కీలక వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
======================================================================================
12.మీనం రాశి ఫలాలు 2023
పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి ఈ రోజు కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
===========================================================================================