ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 05.09.2023 మంగళవారం
జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. – బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ మొబైల్ : 9494981000
వారం: మంగళవారం, తిథి: షష్టి
నక్షత్రం: భరణి, సం: శ్రావణం,
సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం
1. మేషం రాశి ఫలాలు 2023
మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చేసేటటువంటి పనులు. కలసివచ్చును. చికాకులు అధికముగా ఉండును. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023
వృషభరాశివారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఖర్చులు నియంత్రించుకోవాలి. రైతాంగం, సినీరంగంవారికి కొంత కలసివచ్చును. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.
===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023
మిథునరాశి జాతకులకు ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రణాళికాబద్దంగా మీ యొక్క పనులు నిర్వర్తిస్తే సత్ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూలం. ఈరోజు ఏ పని చేసినా కలసివచ్చును. మరింత శుభ ఫలితాలు నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీరు చేసేటటువంటి పనుల్లో పురోగతి కనబడును. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కుటంబపరంగా అనుకూలం. ఆరోగ్యపరంగా మధ్యస్థం. వృత్తి ఉద్యోగపరంగా మధ్యస్థం నుండి అనుకూలం. మరింత శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.
==========================================================================
సింహరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు నియంత్రించుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. మీరు చేసే పనుల్లో చికాకులు ఇబ్బందులు కలుగును. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టును. ఆవేశపూరిత నిర్ణయాలకు, గొడవలకు దూరంగా ఉండాలి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023
కన్యారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. రుణ సమస్యలు బాధించును. చికాకులు, ఇబ్బందులతో కూడిన వాతావరణం. వ్యాపారస్తులకు కలసి వచ్చే రోజు. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. ఆర్థిక సమస్యలు బాధపెట్టును. మరింత శుభఫలితాలు పొందాలంటే రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023
తులారాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా కలసివచ్చే రోజు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలం. వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలకు, విద్యార్థులకు కలసివచ్చే సమయం. ఖర్చులు నియంత్రించుకోవాలి. వాద ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థం నుండి చెడు సమయం. ఆవేశపడకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు. మరింత శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి.
====================================================================================
9.ధనుస్సు రాశి ఫలాలు 2023
ధనూరాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ధనపరంగా కలసివస్తుంది. ప్రయాణాలు అనుకూలించును. ఉద్యోగస్తులకు కలసివచ్చే రోజు. వ్యాపారస్తులకు అనుకూలం. విద్యార్థులకు ఈరోజు అన్ని విధాలుగా కలసివచ్చును. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది.
======================================================================================
10.మకరం రాశి ఫలాలు 2023
మకర రాశివారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. చేసేటటువంటి పనుల్లో చికాకులు అధికము. గొడవలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిళ్ళు ఏర్పడును. స్త్రీలు ఆరోగ్య మరియు కుటుంబపరమైన విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు మధ్యస్థం సమయం. రైతాంగం, సినీరంగం వారికి అనుకూలంగా లేదు. దుర్గాదేవిని పూజించాలి.
==========================================================================================
11.కుంభం రాశి ఫలాలు 2023
కుంభరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. జన్మశని ప్రభావం వలన కుటుంబ మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఏర్పడును. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా జాగ్రత్తలు వహించాలి. ప్రతి పనిలో చికాకులు ఏర్పడును. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి.
======================================================================================
12.మీనం రాశి ఫలాలు 2023
మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు అధికమగును. ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏర్పడును. కోర్టు సమస్యలు ఇబ్బంది పెట్టును. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలి. అప్పులు చేయరాదు. నమ్మి ధనాన్ని అందచేయరాదు. ఉద్యోగస్తులకు మధ్యస్థం. వ్యాపారస్తులకు, రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థం నుండి చెడు సమయం. బుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి.
===========================================================================================