Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.09.2023 సోమవారం

 Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.09.2023 సోమవారం

జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) 04.09.2023

వారం: సోమవారం, తిథి: పంచమి,

నక్షత్రం: అశ్విని, మాసం: శ్రావణం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

1. మేషం రాశి ఫలాలు 2023

మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. శుభ కాలం నడుస్తోంది. ధనలాభం సూచితం. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలంతో అధికారును మెప్పిస్తారు. మీరు ధర్మాన్ని అనుసరిస్తారు. మీకు సంబంధం లేని విషయాలకు దూరం పాటించండి. శివాష్టకం పఠించండి. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయండి. శుభం కలుగుతుంది.

==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023

వృషభరాశి వారికి శుభ ఘడియలు. ఒక పనిలో విజయం సాధిస్తారు. పెద్దల ప్రశంసలు పొందుతారు. పొదుపు పాటించకపోతే ఇబ్బందులు పడతారు. మొహమాటం కారణంగా శ్రమ పెరుగుతుంది. మనసుకు ఇబ్బంది కలిగించే సంఘటనలుంటాయి. అలాంటి సందర్భాల్లో తెలివిగా ప్రవర్తిస్తే మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. శివుడిని పంచామృతాలతో అభిషేకం చేయండి. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయండి. శుభం కలుగుతుంది.

===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023

మిథునరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. రుణ సమస్యలు ఎదురైనా మిత్రులు ఆదుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి. ఆధ్యాత్మికంగా మంచికాలం. కలహ సూచన ఉంది. ఇతరులు అపార్ధం చేసుకునేలా మాట్లాడకూడదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. శివుడిని తేనెతో అభిషేకం చేయండి. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి. శుభం కలుగుతుంది.

========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023

కర్మాటక రాశి వారికి ఈ రోజు మీరు ఆచితూచి అడుగువేయాలి. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆర్ధికంగా నష్టం రాకుండా చూసుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగండి. సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరాలకు సాయపడేవారున్నారు. ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణ అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. పాలతో శివుడిని అభిషేకం చేయండి. శుభఫలితాలు కలుగుతాయి.

==========================================================================
సింహం :- కన్యారాశి వారికి ఈ రోజు మధ్యస్థం నుండి అనుకూలంగా ఉన్నది. ఉత్సాహంగా పనిచేస్తూ విజయం సాధిస్తారు. అవసరాలకు డబ్బు అందుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ఆలోచన విధానంలో పరిపక్వత వస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరి మన్ననలూ అందుకుంటారు. గొడవల్లోకి వెళ్లొద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి. శుభం కలుగుతుంది.
============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023

కన్యారాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. ఉత్సాహంగా పనిచేస్తే విజయం వరిస్తుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ఆలోచనా విధానంలో పరిపక్వత వస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరి మన్ననలూ అందుకుంటారు. మిత్రబలం పెరుగుతుంది. శత్రుపీడ తొలగుతుంది. వివాదాలకు తావివ్వకండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయం పారాయణ చేయడం శుభకరం.
=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023

తులారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కష్టపడితే విజయం లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమైన పని పూర్తవుతుంది. శుభవార్త వింటారు. పట్టుదలతో వ్యవహరిస్తే బంగారు భవిష్యత్తు మీ సొంతం. కొన్ని సందర్భాల్లో మనసుకు భయం కలుగుతుంది. ఒత్తిడిని జయించాలి. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది. శుభం కలుగుతుంది.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023

వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల మాటలు ప్రేరణనిస్తాయి. ఆర్థికంగా శక్తిమంతులవుతారు. మేధా సంపత్తితో విజయాన్నందుకుంటారు. విఘ్నాలను అవలీలగా అధిగమిస్తారు. ప్రలోభాలకు లొంగరాదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందూ వినోదాలతో కాలం గడుస్తుంది. పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి. శుభం కలుగుతుంది.

====================================================================================

9.ధనుస్సు రాశి ఫలాలు 2023

ధనూరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వ్యాపారపరంగా లాభదాయకం. కొత్త వస్తువులు కొంటారు. భూలాభము ఉన్నది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. అనవసర ప్రయాణాలుంటాయి. పెద్దల ఆదరాభిమానాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. విజయం లభిస్తుంది. ధనూరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.
======================================================================================

10.మకరం రాశి ఫలాలు 2023

మకరరాశి వారికి ఈ రోజు మధ్యస్తం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధర్మచింతనతో వ్యవహరించాలి. ఆర్థికంగా మిశ్రమకాలం. ఉద్యోగంలో శుభఫలితాలున్నాయి. వ్యతిరేకంగా మాట్లాడేవారున్నారు జాగ్రత్త. ప్రమాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు కలసివస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తపడాలి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసి శివ అష్టోతర శతనామావళి పఠించండి. శుభం కలుగుతుంది.
==========================================================================================

11.కుంభం రాశి ఫలాలు 2023

కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ప్రశాంతంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభయోగాలున్నాయి. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. శ్రమ అవసరం. ఆర్ధిక విజయం ఉంది. అభీష్టాలు నెరవేరతాయి. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
======================================================================================

12.మీనం రాశి ఫలాలు 2023

మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో మిత్రుల సూచనలు తీసుకోవాలి. అధికారుల వద్ద కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఏ విషయంలోను అశ్రద్ధ వద్దు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. మనసు పెట్టి పని చేయండి. మంచి ఫలితాలను సాధిస్తారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.
===========================================================================================

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *