ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 29.08.2023 మంగళవారం

 ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 29.08.2023 మంగళవారం

జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

1. మేషం రాశి ఫలాలు 2023

మేషం :- మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబముతో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. నిర్ణయాల్లో సంయమనం అవసరం. స్త్రీలు, రాజకీయ నాయకులకు కలసి వచ్చే సమయం. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

==========================================================================
2.వృషభం రాశి ఫలాలు 2023

వృషభం :- వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు ఆనందకరమైన వాతావరణం. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. స్త్రీలు ఇష్టమైన వస్తువుల కోసం ధనమును ఖర్చు చేసెదరు. సోదరవర్గంతో ఆహ్లాదంగా గడుపుతారు. మీరు చేసే పనులు కలసివస్తాయి. అమ్మవారిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

===========================================================================
3.మిథునం రాశి ఫలాలు 2023

మిథునం :- మిథున రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికముగా ఉండటం. చికాకులతో కూడిన వాతావరణం ఏర్పడును. కుటుంబముతో ఇబ్బందికరమైన స్థితి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యాపారస్తులకు సరైన సమయానికి ధనం చేతికి అందదు. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి. శుభం జరుగుతుంది.

========================================================================
4.కర్కాటకం రాశి ఫలాలు 2023

కర్కాటకం :-కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు, ఆందోళనలు ఉన్నప్పటికి అనుకున్న పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు ధనపరమైనటువంటి సమస్యలను అధిగమించెదరు. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేని రోజు. రైతాంగం, సినీరంగంవారికి మధ్యస్థ సమయం. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి. శుభం కలుగుతుంది.

==========================================================================
సింహం :- సింహరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు, రాజకీయ నాయకుల ప్రమేయాలు ఇబ్బంది కలిగించును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమగును. రైతాంగం, సినీరంగంవారికి అంత అనుకూలంగా లేదు. ఆవేశపూరిత నిర్ణయాలకు, ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలని సూచన. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

============================================================================
6.కన్య రాశి ఫలాలు 2023

కన్య :-కన్యారాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. రుణ సమస్యలు బాధించును. చికాకులు, ఇబ్బందులతో కూడిన వాతావరణం. వ్యాపారస్తులకు కలసి వచ్చే రోజు. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. ఆర్థిక సమస్యలు బాధపెట్టును. మరింత శుభఫలితాలు పొందాలంటే రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

=============================================================================
7.తులారాశి రాశి ఫలాలు 2023

తుల :- తులారాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం. చేసే పనులు కలసివస్తాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలకు మధ్యస్థ సమయం. ఆవేశపూరిత నిర్ణయాలకు, ఆలోచన లేని వ్యవహారాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు కలసివచ్చే రోజు. రాజకీయరంగం, రైతాంగం, సినీరంగం వారికి కలసివచ్చే రోజు. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
=============================================================================
8.వృశ్చికం రాశి ఫలాలు 2023

వృశ్చికం :- వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనస్సును నియంత్రించుకోవాలి. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కుటుంబ, ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. పని ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు ఏర్పడును. సంతానం వలన చికాకులు కలుగును. విద్యార్థులకు మధ్యస్థం. రైతాంగానికి అనుకూలం. స్త్రీలకు చెడు సమయం. మరింత శుభఫలితాలు పొందాలంటే బుుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుడిని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

====================================================================================

9.ధనుస్సు రాశి ఫలాలు 2023

ధనూరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. అదృష్టప్రాప్తి ఉంది. ఆనందముగా కాలం గడుస్తుంది. ప్రశాంతంగా పనిచేస్తే విజయం లభిస్తుంది. గురువు అనుగ్రహం ఉంటుంది. గతంలో కాని పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి. నిందారోపణ చేసేవారున్నారు. శుభవార్త వింటారు. వారం మధ్యలో మంచి జరుగుతుంది. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.
======================================================================================

10.మకరం రాశి ఫలాలు 2023

ధనస్సు :-మకర రాశివారికి ఈ రోజు మీకు మద్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయములు ఏర్పడు సూచన. చికాకులు, ఘర్షణలు, మానసిక ఆందోళనలు ఏర్చడును. స్త్రీలకు మధ్యస్థం నుండి చెడు సమయం. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. దుర్గాదేవిని పూజించాలి. దేవీ ఉపాసన చేయడం మంచిది. రాహు కాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.
==========================================================================================

11.కుంభం రాశి ఫలాలు 2023

కుంభం :- కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ తెలివితేటలతో అధికారులను మెప్పిస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రుల ఆదరాభిమానాలు లభిస్తాయి. అదృష్టం తోడుంటుంది. ఇతరుల సలహాలు పనికిరావు. విజయం ఉంది. వేంకటేశ్వరస్వామిని ప్రార్ధించండి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

======================================================================================

12.మీనం రాశి ఫలాలు 2023

మీనం :- మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు అధికమగును. ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏర్పడును. కోర్టు సమస్యలు ఇబ్బంది పెట్టును. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలి. అప్పులు చేయరాదు. నమ్మి ధనాన్ని ఇవ్వ రాదు. ఉద్యోగస్తులకు మధ్యస్థం. వ్యాపారస్తులకు, రైతాంగం, సినీరంగం వారికి మధ్యస్థం నుండి చెడు సమయం. బుుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

===========================================================================================

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *