కాంగ్రెస్ లో టికెట్ కావాలా నాయనా ఫీజ్ కట్టు టికెట్ కొట్టు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో శాస్త్రీయమైన పార్టీ నిర్వహణ ధోరణిలోకి వెళ్లిపోతున్నట్టుగా కనిపిస్తోంది.
పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే.. ఎవ్వరైనా సరే.. అందుకోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. దరఖాస్తులు
దాదాపుగా అన్ని పార్టీలు అడుగుతూనే ఉంటాయి. కానీ, కాంగ్రెసులో ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే
ప్రతి ఒక్కరూ నిర్ణీతమైన పీజు కూడా చెల్లించాల్సిందే. ఈ మేరకు టీపీసీసీ నిర్ణయం తీసుకుంది.
అయితే తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ధరఖాస్తుకు కూడా ఫీజు వచ్చింది. అవును… మీరు విన్నది నిజమే….
నేను చదివింది నిజమే. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ఉత్సాహం మీదున్న కాంగ్రెస్ పార్టీ…
తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావడం తథ్యం అనే నమ్మకంతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రాజకీయంగా
కొత్త అడుగులువేస్తూ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ నిర్ణీతమైన పీజు కూడా
చెల్లించాల్సిందనే నిర్ణయం పెట్టింది.
పైగా అనూహ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో బీజేపీ కాస్త తగ్గిందనే కామెంట్లు
రావడంతోపాటు.. కాంగ్రెస్ లో భారీ చేరికలు జరగడంతో పార్టీ టికెట్ల కోసం ఆశావహుల ఒత్తిడి చాలా ఎక్కువగా
ఉందని అంటున్నారు. ఫీజులు పెట్టడం వల్ల ఆ ఒత్తిడి తగ్గదు గానీ.. పార్టీకి కాసుల వర్షం కురిసే అవకాశం అయితే ఉంది!
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని
అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఇందులో భాగంగా… సెప్టెంబరు నెలలోనే అభ్యర్థుల
మొదటి జాబితా ప్రకటించాలని భావిస్తోందని తెలుస్తోంది.
ఎన్నికలకు వీలైనంత ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం వలన ఎడ్వాంటేజీ ఉంటుందని పార్టీ
పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా.. ప్రచారంలో దూసుకువెళ్లేందుకు అవకాశం ఉండటంతో పాటు,
నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించడానికీ సమయం ఉంటుందని భావిస్తోన్నారట.
ఇక అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు సబ్ కమిటీ
ఏర్పాటు చేశారు. ఈ సబ్‌కమిటీకి దామోదర రాజనర్సింహ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా…రోహిత్ చౌదరి, మహేష్ గౌడ్
సభ్యులుగా ఉన్నారు.
విధివిధానాలు ఖరారు చేసేందుకు 17వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. 18 నుంచి 25వ తేదీ వరకు డీడీ రూపంలో
రుసుము చెల్లించి టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ అభ్యర్థులకు రూ.పది వేలు…..
బీసీ అభ్యర్థులకు రూ. 5 వేలు……ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 2500……. దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఇలా
దరఖాస్తు చేసిన అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి.. సర్వే ఆధారంగా నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురిని
ఎంపిక చేసి AICC కి పంపాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఇలా పంపిన పేర్లలో ఒకరిని ఎంపిక చేసి..
మిగతా వారిని సముదాయించాలని పార్టీ భావిస్తోంది. అంటే డీ డీ కట్టిన వాళ్లందరికీ టికెట్స్ రావన్నమాట
కర్ణాటకలో గెలుపు జోష్‌తో ఉన్న కాంగ్రెస్ అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది.
అధిష్టానం సూచనలతో టీకాంగ్రెస్ ముందుకెళ్తోంది. కలిసికట్టుగా ముందుకు సాగాలని..పార్టీ గెలుపు కోసం
ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఢిల్లీ పెద్దలు సూచించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే… కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేకపోతే… పార్టీ విరాళాలు రూపంలో అడుక్కోవాలి అంటూ కొందరు….
తెలంగాణ లో ….పార్టీ ని గెలిపించుకోడానికి ….కాంగ్రెస్ ఆడే డ్రామాలు అంటూ మరికొంతమంది….
కర్ణాటక ఎన్నికలను అడ్డం పెట్టుకొని…. తెలంగాణ లో కాంగ్రెస్ గెలవాలని చూస్తోందని ఇంకొందరు అంటున్నారు.
తెలంగాణ లో కాంగ్రెస్ ను …..ఎన్ని క్రేయిన్ లు పెట్టి పైకి లాగిన పైకి రాదు అంటూ మరి కొంతమంది …..
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందో రాదో ఎవ్వరికి తెలియదు … అప్పుడే కర్ణాటక తరహాలో అంటూ
ఓట్లు కోసం తాయిలాలు మీద తాయిలాలు ప్రకటించడం ఏందో …. మళ్ళి పార్టీ టికెట్ పేరుతో జనం దగ్గర డబ్బులు
గుంజుడేందో ఆ దేవుడికే ఎరుక. వెనుకటి ఒక సామెత చెప్పినట్టు ….దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవడం అంటే ఇదేనేమో