రాశిఫలాలు 15 అక్టోబర్ 2026: నవరాత్రుల్లో ఐదో రోజున సౌభాగ్య యోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు ఆదాయం పెరిగే అవకాశం

 రాశిఫలాలు 15 అక్టోబర్ 2026: నవరాత్రుల్లో ఐదో రోజున సౌభాగ్య యోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు ఆదాయం పెరిగే అవకాశం

రాశిఫలాలు 15 అక్టోబర్ 2026: నవరాత్రుల్లో ఐదో రోజున సౌభాగ్య యోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు ఆదాయం పెరిగే అవకాశం

రాశిఫలాలు 15 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు నవరాత్రుల్లో ఐదో రోజున సౌభాగ్య, శోభన యోగాల ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Oct15

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి వారికి అధిపతిగా ఉండే కుజుడు ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు. చంద్రుడు అష్టమ స్థానంలో ఉండి గురుడి ద్రుష్టిలో ఉంటాడు. కెరీర్ పరంగా మీకు పురోగతి లభించనుంది. కొన్ని ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మరోవైపు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి నుంచి చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. మరోవైపు మీ ఖర్చులు పెరగొచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బంధువుల నుంచి మీకు ఇబ్బందులు పెరగొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి నుంచి చంద్రుడు ఈరోజు ఆరో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ రాశికి అధిపతిగా ఉండే బుధుడు నాలుగో స్థానంలో ఉండటం వల్ల శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించొచ్చు. మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కుటుంబ బాధ్యతల కారణంగా మీకు మానసిక ఒత్తిడి పెరగొచ్చు. మీ కుటుంబానికి, జీవిత భాగస్వామికి సమయం కేటాయించలేకపోవచ్చు. దీంతో మీరు విచారం వ్యక్తం చేయొచ్చు. మరోవైపు మీకు స్నేహితుల నుంచి మద్దతు లభించొచ్చు. మీరు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండొద్దు.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతిగా ఉండే చంద్రుడు నీచభంగ స్థానంలో ఉండి శుభ ఫలితాలు అందించనున్నాడు. ఎందుకంటే గురు గ్రహం చంద్రుడిపై ద్రుష్టి సారిస్తుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు.

వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో బంధం మరింత బలపడుతుంది.

పరిహారం : ఈరోజు విష్ణు మంత్రాలను పఠించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి నుంచి చంద్రుడు ఆనంద స్థానంలో సంచారం చేయనున్నాడు. సూర్యుని అనుగ్రహంతో మీకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం, ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి.

మీ కుటుంబ జీవితంలో పెద్దల నుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి.

పరిహారం : ఈరోజు లక్ష్మీనారాయణుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి నుంచి చంద్రుడు మూడో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుంచి సూర్యుడు లగ్న స్థానంలో సంచారం చేయనున్నాడు. బుధుడు ఈ రాశి నుంచి రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఈరోజు మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి రావొచ్చు.

మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీ ఇంట్లో మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. గతంలో మీరు చేసిన పనిని కూడా సమీక్షించుకోవాల్సి ఉంటుంది.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. బుధుడు, శుక్రుడు కలిసి ఇదే రాశిలో నివాసం ఉన్నారు. ఈ సమయంలో వ్యాపారవేత్తలకు ఆర్థిక లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు పొరుగువారి నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు.

పరిహారం : ఈరోజు విష్ణుమూర్తి ఆలయంలో దానధర్మాలు చేయాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కుజుడు, గురు గ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేయడం కారణంగా సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారికి ఈరోజు సూర్యుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ తండ్రి వైపు నుంచి మీకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. రాజకీయ, ప్రభుత్వ రంగాలకు సంబంధించిన పనులలో మంచి విజయం సాధించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా సహనంతో ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి.

పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. గురు గ్రహం ప్రభావంతో మీకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది.

మీ ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబ విషయాలకు సంబంధించిన ఖర్చులు పెరగొచ్చు. మీ జీవిత భాగస్వామి అంచనాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పరిహారం : ఈరోజు విష్ణు మంత్రాలను పఠించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఇదే రాశిలో రాహువు సంచారం చేయడం, చంద్రుడు కర్మ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు మీకు ఇబ్బంది కలిగించొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

మీకు సాంకేతిక సమస్యలు కలిగించొచ్చు. కొనుగోళ్లు, అమ్మకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ వైవాహిక జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ఈరోజు శని చాలీసా పఠించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారికి ఈరోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశి నుంచి చంద్రుడు తొమ్మిదో స్థానంలో, గురుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నారు. మీరు విదేశీ వనరుల ప్రయోజనం పొందొచ్చు. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఇరుగుపొరుగువారితో, స్నేహితులతో సంభాషణలు పెరుగుతాయి.
ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ప్రేమ, సామరస్యం నెలకొంటాయి.

పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *