అన్నం పెట్టడం లేదు.. నడవలేకపోతున్నా.. గుండెల్ని పిండేస్తున్న 9 ఏళ్ల పసివాడి ఆవేదన.. చలించిపోయిన మంత్రి నారా లోకేష్
అన్నం పెట్టడం లేదు.. నడవలేకపోతున్నా.. గుండెల్ని పిండేస్తున్న 9 ఏళ్ల పసివాడి ఆవేదన.. చలించిపోయిన మంత్రి నారా లోకేష్

విచారించగా బాలుడు నర్రవాడ గ్రామానికి చెందినవాడని తెలిసింది. ఈ దారుణాన్ని చూసిన వెంటనే చలించిపోయిన ఆ వ్యక్తులు ఆవేదనతో ఆ పసివాడి వీడియోని పెట్టి సోషల్ మీడియా వేదికగా అత్యవసర విజ్ఞప్తి చేశారు. మంత్రి నారా లోకేష్‌ను, ఆంధ్రప్రదేశ్ పోలీసులను, చైల్డ్ వెల్ఫేర్ అధికారులను ట్యాగ్ చేస్తూ.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బాలుడిని రక్షించాలని అభ్యర్థించారు. బాలుడికి తక్షణ వైద్యం, ఆహారం అందించాలని, వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాలని కోరారు. అంతేకాదు ఈ దారుణానికి కారణమైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.
చలించిపోయిన మంత్రి నారా లోకేష్…
మొత్తానికి ఆ పసివాడి ఆర్తనాదం ప్రభుత్వం పెద్దల చెవిన పడింది. ఈ హృదయ విదారక ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆ చిన్నారి కన్నీటి వ్యథను చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యాయని పేర్కొన్నారు. పసివాడితో గొర్రెలు మేపించడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదంటూ.. వెంటనే రంగంలోకి దిగాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను నారా లోకేష్ ఆదేశించారు. బాలుడి భద్రతను నిర్ధారించి అతడికి అవసరమైన సంరక్షణ, రక్షణ, మద్దతు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆ బాలుడిని వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. ఈ విషయాన్ని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.