రాశిఫలాలు 29 జూలై 2026: గురు పౌర్ణమి నాడు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశుల జీవితాల్లో వెలుగులు

 రాశిఫలాలు 29 జూలై 2026: గురు పౌర్ణమి నాడు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశుల జీవితాల్లో వెలుగులు

రాశిఫలాలు 29 జూలై 2026: గురు పౌర్ణమి నాడు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశుల జీవితాల్లో వెలుగులు

horoscope today 29 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురు పౌర్ణమి నాడు గురు, చంద్రుల మధ్య సమసప్తక, గజకేసరి యోగాల ప్రభావంతో వృషభం సహా ఈ 5 రాశులకు గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Jul29
horoscope today 29 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గురుడు చంద్రుడిపై సప్తమ ద్రుష్టిని ప్రసరింపజేయడం వల్ల అత్యంత శుభప్రదమైన గజకేసరి యోగం ఏర్పడనుంది. సూర్యుడు కూడా చంద్రునిపై తన పూర్తి ద్రుష్టిని ప్రసరించడం వల్ల ఈ గ్రహ స్థితిని మరింత బలపరుస్తుంది. దీంతో పాటు ప్రీతి, ఆయుష్మాన్ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా వృషభం సహా ఈ రాశుల వారికి జీవితంలో కొత్త వెలుగులొచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

​మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

స్నేహితులను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటి ఆహారాన్ని తీసుకోకూడదు.

పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువు మంత్రాలను జపించి, గురువులను పూజించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

​వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. గురు పౌర్ణమి నాడు ఏర్పడే శుభ యోగాల కారణంగా మీ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి.

వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. భవిష్యత్తులో పెట్టుబడుల నుంచి మీరు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు మీ శక్తి మేరకు ఆహార ధాన్యాలు, దుస్తులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి గురుపౌర్ణమి వేళ ఏర్పడే శుభ యోగాల కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి లభించే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఉన్నత స్థానాలను చేరుకోవచ్చు. బుధుడి ప్రభావం కారణంగా మీ శక్తి, సామర్థ్యాలు పెరగొచ్చు. చంద్రుడు ఈ రాశి నుంచి అష్టమ స్థానంలో సంచారం చేయడం కారణంగా టెక్నాలజీ రంగంలో ఉండే వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీకు గురువుల నుంచి మార్గదర్శకం, ఆశీస్సులు, ప్రేమ లభిస్తాయి.

పరిహారం : ఈరోజు గురువుల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు గురు గ్రహం అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఇదే రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండటం కారణంగా మీ తెలివితేటలు పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు.

మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని, గురువులకు ఏదైనా బహుమతి ఇవ్వాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారికి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరగడంతో పనులన్నీ సకాలంలో పూర్తి చేయొచ్చు. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి.

మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. మీకు పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది. కొత్త ఇల్లు, వాహనం లేదా ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పరిహారం : ఈరోజు గురువులకు ఏదైనా బహుమతి ఇచ్చి, వారి ఆశీస్సులు తీసుకోవాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు రానున్నాయి. బుధుడి అనుగ్రహంతో మీ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీరు చేసే పనులకు సానుకూల ఫలితాలు రానున్నాయి.

వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ పొదుపును పెంచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీతోబుట్టువుల నుంచి కొన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించే అవకాశం ఉంది.

పరిహారం : ఈరోజు గురువును పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు ఏర్పడే శుభ యోగాల కారణంగా కెరీర్ పరంగా మంచి పురోగతి లభించనుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు కనిపించొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో సఖ్యత ఏర్పడనుంది.

మీకు రావాల్సిన డబ్బును తిరిగి పొందే అవకాశాలున్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఏదైనా శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. కళా, మీడియా రంగాల్లో పని చేసే వారికి శుభ ఫలితాలు రానున్నాయి.

పరిహారం : ఈరోజు శ్రీ విష్ణు చాలీసా పఠించి, గురువులను పూజించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా బిజీగా గడిపే అవకాశం ఉంది. ఈ కారణంగా మీకు కొంత అలసటగా అనిపించొచ్చు. ఈరోజు మీకు కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశం లభించొచ్చు.

ప్రతికూల కార్యకలాపాలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఈరోజు చెడు సలహాలను పట్టించుకోకపోవడమే మంచిది. మీరు చేసే పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం : ఈరోజు గురువులను పూజించి, పేదలకు పండ్లు దానం చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అనేక రంగాల్లో అదృష్టం కలిసి రానుంది. ఈ రాశికి అధిపతి అయిన గురు గ్రహం కారణంగా హంస రాజయోగం ఏర్పడనుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి ఫలితాలు రావొచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభించనుంది.

మీకు కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. మీరు తీర్థయాత్రలకు వెల్లే అవకాశాలున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వాహన సంబంధిత విషయాలలో అపారమైన విజయాలు లభించొచ్చు.

పరిహారం : ఈరోజు గురువుల ఆశీస్సులు తీసుకోవాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా శుభప్రదంగా ఉంటుంది. తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఈరోజు స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

మీకు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశాలున్నాయి. మీ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను గడిపే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

పరిహారం :ఈరోజు గురువుల ఆశీస్సలు తీసుకుని, పేదలకు పండ్లు దానం చేయాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. కొత్త స్నేహితుల రాక కారణంగా మీరు సంతోషిస్తారు.

మీ కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ తోబుట్టువులతో సంబంధాలు బలపడొచ్చు.

పరిహారం : ఈరోజు మీ గురువుకు ఏదైనా బహుమతి ఇచ్చి, వారి ఆశీస్సులు తీసుకోవాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వినాయకుడి అనుగ్రహం లభించనుంది. గురు గ్రహం కారణంగా మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ పిల్లలకు సంబంధించి శుభవార్తలు వినొచ్చు.

మీ ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. శుభ యోగాల ప్రభావంతో మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలున్నాయి.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పారాయణం చేసి, గురువులను పూజించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *