రాశిఫలాలు 14 జూలై 2026: ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనాలు!

 రాశిఫలాలు 14 జూలై 2026: ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనాలు!

రాశిఫలాలు 14 జూలై 2026: ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనాలు!

horoscope today 14 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఈ 5 రాశులకు మూడు రెట్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

horoscope today 14 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, చంద్రుడి కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. దీంతో పాటు బుధాదిత్య యోగం కూడా ఏర్పడనున్నాయి. చంద్రుడికి రెండో స్థానంలో గురు గ్రహం ఉండటం వల్ల ‘సునాఫా యోగం’ ఏర్పడనుంది. ఈ శుభ యోగాల ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఈ 5 రాశులకు అద్భుతమైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. త్రిగ్రాహి, బుధాదిత్య, సునఫ యోగాల ప్రభావంతో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.

మీ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి.
ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ ఉండే పనులను చేయకపోవడమే మంచిది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో సమన్వయం మెరుగుపడుతుంది.

పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారులు ఆశించిన లాభాలను పొందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభ యోగాల కారణంగా తాము చేసే పనులన్నింట్లో మంచి ఫలితాలు రానున్నాయి. మీ తెలివితేటలతో పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు జీతం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. త్రిగ్రాహి యోగం ప్రభావంతో కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

శుభ యోగాల ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో మంచి విజయాలు సాధించొచ్చు. పెట్టుబడి లేదా సంపదకు సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా మంచి ఫలితాలు రానున్నాయి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో ప్రత్యేక ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు ఎక్కువ మందిని మాటతీరుతో ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీ తెలివితేటలు పెరిగే అవకాశం ఉంది.

ఈరోజు మీరు స్నేహితులతో సరదాగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. ప్రత్యేక యోగాల కారణంగా మీ బంధాలు మరింత బలపడొచ్చు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీరు చేసే పనుల్లో చాలా బిజీగా ఉంటారు. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తితో సమావేశం వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి అవకాశం లభించొచ్చు.

ఈరోజు ప్రతికూల కార్యకలాపాలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. చెడు సలహాలను పట్టించుకోకపోవడమే మంచిది. ఇంట్లో పెద్దల సలహాలను, మార్గదర్శకత్వాన్ని నిర్లక్ష్యం చేయకండి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో కొంత ఒత్తిడి ఎదురుకావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు తాము చేసే పనుల్లో సవాళ్లు ఎదురుకావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కొందరి మాటలు మిమ్మల్ని బాధపెట్టొచ్చు. కాబట్టి వాటిని పట్టించుకోకపోవడం ఉత్తమం. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులకు కొన్ని శుభవార్తలు వినిపించనున్నాయి.

మరోవైపు మీరు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరితో మీకు విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు త్రిగ్రాహి, సునఫ యోగాల వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీకు అనేక కొత్త అవకాశాలు లభించొచ్చు. ఈ కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. ఈరోజు కొందరు ప్రత్యేక వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకుంటారు.

మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు త్రిగ్రాహి యోగం కారణంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు ఉన్నత స్థానాలను చేరుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. అవసరం ఉన్న వారికి మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయాలి. ఉద్యోగులు తాము చేసే పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు.

గురు గ్రహం ప్రభావంతో మీ కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. బంధువుల నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి.

ఉపాధ్యాయులు, గురువుల నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు సాధించే అవకాశం ఉంది. అయితే మీరు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశం రావొచ్చు. మీరు చేసిన పనికి ప్రశంసలు లభించొచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారుల మద్దతు కారణంగా సంతోషంగా ఉంటారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.

మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. మీరు చేసే పని పట్ల సంతోషంగా ఉంటారు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read Latest Astrology News and Telugu News

 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *