రాశిఫలాలు 12 జూన్ 2026: ఈరోజు గజలక్ష్మీ యోగం కటాక్షంతో మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు బలమైన అదృష్ట సంకేతాలు

 రాశిఫలాలు 12 జూన్ 2026: ఈరోజు గజలక్ష్మీ యోగం కటాక్షంతో మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు బలమైన అదృష్ట సంకేతాలు

రాశిఫలాలు 12 జూన్ 2026: ఈరోజు గజలక్ష్మీ యోగం కటాక్షంతో మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు బలమైన అదృష్ట సంకేతాలు

horoscope today 12 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గజలక్ష్మీ యోగం వేళ మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.

horoscope today 12 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు గురుడు, శుక్రుడు కలయిక తో గజలక్ష్మీ యోగం ఏర్పడనుంది. మరోవైపు చంద్రుడు, కుజుడి కలయిక కూడా జరగనుంది. ఇది అత్యంత శుభప్రదమైన స్థితిగా పరిగణించబడుతుంది. అంతేకాదు బుధుడు మిథునంలో ప్రవేశించడం వల్ల భద్ర రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేషరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. వ్యాపారులకు పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త పనులు చేసేందుకు చాలా ఉత్సాహంతో ఉంటారు. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగంలో చేరిక గురించి శుభవార్తలు వినిపించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. స్నేహితుల సాయంతో మీ పనులన్నీ పూర్తి చేస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. బయటి ఆహారం తీసుకోవడం మానుకోవాలి. శుభయోగాల ప్రభావం వల్ల పెద్దల నుంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. మీకు రావాల్సిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణం చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు. పెట్టుబడులు పెరగడం వల్ల మీ సంతోషం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక లేదా మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావొచ్చు. మీరు దానధర్మాలు చేసే అవకాశం కూడా ఉంది. దుర్గాదేవికి తేనేతో కూడిన తమలపాకులను సమర్పించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. శుక్రుడు, గురుడు కలయిక కారణంగా లాభదాయకంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మీరు కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించొచ్చు. ఈరోజు మీరు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పని చేయాలి. మరోవైపు వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీకు స్నేహితులనుంచి మద్దతు లభిస్తుంది. మీరు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారు ఈరోజు కొత్త ప్రణాళికల కోసం పని చేయొచ్చు. ఈరోజు మీరు కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయం గడిపే అవకాశాలున్నాయి. మీ మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడొచ్చు. ఈరోజు మీరు మతపరమైన లేదా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో కొత్త విషయాలను నేర్చుకోవచ్చు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో కోర్టుకు సంబంధించిన పాత వివాదాలన్నీ పరిష్కరించబడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మీరు కొత్త స్నేహితులను కలుసుకోవచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించొచ్చు. ఈరోజు ఊహించని ప్రయోజనాలు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడుపుతారు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినపిస్తాయి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో చంద్రుడు, సప్తమ స్థానంలో గురుడు సంచారం చేయడం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. మీ సోదరులతో ఏదైనా ఉద్రిక్తత లేదా వివాదం తలెత్తితే సంయమనం పాటించాలి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకవోడానికి ప్రయత్నించాలి. మీ జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో చాలా బిజీగా గడుపుతారు. స్నేహితుల సాయంతో మీ పనులన్నీ సులభంగా పూర్తి చేయొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశాలున్నాయి. ఈరోజు పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *