రాశిఫలాలు 16 మే 2026: ఈరోజు శని అమావాస్య వేళ ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడనుంది?
రాశిఫలాలు 16 మే 2026: ఈరోజు శని అమావాస్య వేళ ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడనుంది?
horoscope today 16 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శని అామవాస్య వేళ బుధాదిత్య యోగం ప్రభావంతో ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడనుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Daily Horoscope in Tel May16
horoscope today 16 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మేషం నుంచి వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు ఇదే రోజున శని జయంతిని జరుపుకోనున్నారు. శని దేవుడు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. మరోవైపు వృషభంలో సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. మిథున రాశిలో గురు, శుక్ర కలయికతో గజలక్ష్మీ యోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభ యోగాలతో పాటు శని అమావాస్య వేళ మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు శని జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. మీ పెండింగ్ పనులు పూర్తవ్వొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శని దేవుని అనుగ్రహంతో ఆత్మవిశ్వాసం పెరిగి, కొత్త అవకాశాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి. ఈరోజు మీరు చాలా ఓర్పు, వివేకంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మరోవైపు అంకితభావంతో పని చేయడం వల్ల ప్రశంసలు పొందొచ్చు. మీకు దగ్గరి బంధువులు లేదా పరిచయస్తులపై ఎక్కువగా ఆధారపడటం మీకు నష్టాలను కలిగించొచ్చు. ఆర్థిక పరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మీకు సమస్యలు ఎదురవ్వొచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. శని దేవుని అనుగ్రహంతో మీరు ప్రత్యేక విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒత్తిడి, ఆందోళన నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంది. మీకు మనశ్శాంతి లభించొచ్చు. ఈరోజు మీరు పనికి సంబంధించి ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిన్నపాటి శారీరక సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ బాధ్యతనైనా తేలికగా తీసుకోకుండా అంకితభావంతో నిర్వహించడం మంచిది. శని దేవుని ఆశీస్సులతో మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి శని అమావాస్య వేళ మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు ఏదైనా పెట్టుబడి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి వాటిని వాయిదా వేయడం మంచిది. శని దేవుడు మీ సహనం, ఓర్పును పరీక్షించే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. మీరు సహనంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు రావొచ్చు.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి శని అమావాస్య వేళ అనుకూలంగా, లాభదాయకమైన ఫలితాలు రావొచ్చు. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మంచి ఫలితాలు సాధించొచ్చు. అయితే ఆరోగ్య పరంగా కొన్ని చిన్న సమస్యలు తలెత్తొచ్చు. మీ వైవాహిక జీవితంలో విభేదాలు పెరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చాలా ఓపికగా, ప్రశాంతంగా ఉంటే, పరిస్థితులన్నీ క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శని జయంతి సందర్భంగా శుభ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అయితే మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సమయపాలనతో, కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు శని జయంతి సందర్భంగా కొత్త ఆశలను, సానుకూల మార్పులను ఆశించొచ్చు. శని దేవుని అనుగ్రహంతో నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. మీ మాటలు, సంభాషణలపై ప్రత్యేక నియంత్రణ ఉంచుకోవాలి. కఠినమైన లేదా తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి శని జయంతి రోజున అనేక రంగాల్లో శుభ ఫలితాలు రానున్నాయి. మీకు కొత్త ఆదాయ మార్గాలు తెరచుకునే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరగొచ్చు. మీ మనసులో ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులకు సానుకూల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. మీ భవిష్యత్తు పురోగతికి సహాయపడొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితం లభించొచ్చు.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి శని జయంతి సందర్భంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో శుభప్రదంగా ఉంటుంది. శని దేవుని అనుగ్రహంతో ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు రావొచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి శని అమావాస్య రోజున సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఈరోజు చాలా ఓపికగా ఉండాలి. ప్రశాంతమైన వైఖరితో వ్యవహరిస్తే, విజయం మీకు సులభంగా లభించొచ్చు.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి శని జయంతి సందర్భంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఇదే రాశిలో శని గ్రహం సంచారం కారణంగా వీరికి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది. ఈరోజు మీ నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలలో స్పష్టమైన పెరుగుదలను గమనించొచ్చు. శనిదేవుని అనుగ్రహంతో మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.