రాశిఫలాలు 29 ఏప్రిల్ 2026: ఈరోజు హర్ష యోగం ప్రభావంతో సింహం, కన్య సహా ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు
రాశిఫలాలు 29 ఏప్రిల్ 2026: ఈరోజు హర్ష యోగం ప్రభావంతో సింహం, కన్య సహా ఈ 4 రాశులకు ఆర్థిక లాభాలు
horoscope today 29 April 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు హర్ష యోగం ప్రభావంతో సింహం, కన్య సహా ఈ 5 రాశులకు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscop in Tel Apr29
horoscope today 28 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు వజ్ర, హర్ష యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా సింహం, కన్య సహా కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు రావొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. బుధుడి స్థానం బలంగా మారడంతో పాటు వినాయకుడి అనుగ్రహం లభించనుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సూర్యుని అనుగ్రహంతో మీ ఆత్మవిశ్వాసం పెరగొచ్చు. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి దశలో సంచారం చేయడం కారణంగా ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. గురుడి అనుగ్రహంతో అన్ని రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సకాలంలో మీకు ఆర్థిక సాయం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభించొచ్చు. అయితే అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. ఈరోజు ఎక్కువ సమయం వినోదానికి కేటాయించే అవకాశం ఉంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ పిల్లల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే బయటి ఆహారం మానేయాలి. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు బద్ధకాన్ని వదిలేసి, పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు చురుగ్గా మారిపోతారు.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ కుటుంబం వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీ స్నేహితుల మద్దతుతో పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. మీరు చేసే పనులకు ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభించొచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన పరిస్థితులు లభించే అవకాశం ఉంది.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు బుధుడి అనుగ్రహంతో అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం బాగా పెరిగే అవకాశాలున్నాయి. మీరు చేసే పనిలో పురోగతి లభిస్తుంది. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు, ధైర్యం, సహనం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు ఇష్టం లేని పనులు చేయాల్సి రావొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అనుకోని ఖర్చులు కూడా పెరగొచ్చు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీ తోబుట్టువులతో మనస్పర్దలు రావొచ్చు. అయితే చర్చల ద్వారా వాటికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. గురు గ్రహం అనుగ్రహంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయాలు సాధించే అవకాశాలున్నాయి. అయితే ఈరోజు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. అధిక ఖర్చుల కారణంగా భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఏర్పడొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలున్నాయి. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందొచ్చు.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు గురుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి సప్తమ స్థానంలో తిరోగమనం చేయడం కారణంగా కొన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అయితే నాలుగో స్థానంలో శని ప్రభావంతో కొన్ని ఆటంకాలు ఏర్పడొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీ సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు. ఈరోజు పనికి సంబంధించి మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు బుధుడి అనుగ్రహంతో శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈ రాశి నుంచి ఆరో స్థానంలో సంచారం చేస్తున్న గురుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. అంతేకాదు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మీకు శత్రువుల నుంచి భయాలు తొలగిపోతాయి. మీరు ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. ఈరోజు మీ కోరికలలో ఒకటి నెరవేరే అవకాశం ఉంది.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. బుధుడు, సూర్యుని ప్రభావంతో మీకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కొంత పనిభారం పెరగొచ్చు. అయితే మీ తెలివితేటలతో వాటిని సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభించొచ్చు. ఈ కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.