రాశిఫలాలు 28 ఏప్రిల్ 2026: ఈరోజు హర్ష యోగం ప్రభావంతో వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలు

horoscope today 28 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు హర్ష యోగం ప్రభావంతో వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశుల వారు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Apr28
horoscope today 28 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తర ఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు కుజుడి స్థానం బలపడనుంది. హర్ష యోగం, వ్యాఘాత యోగాలు ఏర్పడనున్నాయి. దీంతో పాటు మీకు హనుమంతుని అనుగ్రహం లభించనుంది. హనుమాన్ ఆశీస్సులతో మీరు ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు. మీకు కష్టాల నుంచి విముక్తి లభించొచ్చు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పటికీ, ఆర్థిక ప్రణాళిక చాలా కీలకం. ఈరోజు తొందరపాటు, ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు సహోద్యోగులతో ఎలాంటి వివాదాలలో చిక్కుకోకుండా ఉండాలి. పెండింగులో ఉన్న పనులను క్రమశిక్షణతో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందనున్నాయి. స్నేహితుల సాయంతో మీ మార్గంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు, సాయం లభిస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారులు వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు సాయంత్రం ఒక వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈరోజు పెండింగులో ఉన్న అనేక పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగతుంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి నుంచి మూడో స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడు మీ ఆదాయ మార్గాలను పెంచే అవకాశం ఉది. అయితే మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చేసే పనులు నెమ్మదిగా సాగొచ్చు. మేష రాశిలో దశమ స్థానంలో సూర్యుడి సంచారం కారణంగా మీ పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరోవైపు బుధుడి ప్రభావంతో మీ పనుల్లో కొంత గందరగోళం ఏర్పడుతుంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీకు అకస్మాత్తుగా ఖర్చులు పెరగొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మీ ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి దశమ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడి ప్రభావంతో మీకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే ప్రమాదకరమైన నిర్ణయాలు నష్టాలకు దారితీయొచ్చు. మీరు ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉండాలి. ఏదైనా పెద్ద కొనుగోళ్లు చేసే ముందు మీ బడ్జెట్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. దశమ స్థానంలో ఉన్న గురు అనుగ్రహంతో మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధించొచ్చు. ఉద్యోగులకు సహోద్యోగులతో విభేదాలన్నీ తొలగిపోయే అవకాశాలున్నాయి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. ఉద్యోగులకు జీతం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపించొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ జీవిత భాగస్వామి సహకారంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభించొచ్చు. మీ కోరికలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే పనుల్లో ఆటంకాలన్నీ అధిగమిస్తారు. వ్యాపారులు ఆశించిన మేరకు లాభాలు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా మీ ధైర్యం పెరుగుతుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు మాత్రం పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఇతరులు చేసిన పొరపాట్ల వల్ల మీకు నిందలు రావొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వ్యక్తిగత ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం మానుకోవాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. లేదంటే ఇది మీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారు ఈరోజు తమ పనులన్నీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు చేసే పనులన్నింట్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ బాధ్యతలను క్రమశిక్షణతో, అంకితభావంతో నిర్వర్తించాలి. మరోవైపు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో చాలా ఓపికగా ఉండాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి లభించొచ్చు. ఈరోజు మీరు మతపరమైన కార్యక్రమాల్లో ఎక్కువ సమయం పాల్గొంటారు. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో మంచి సంబంధాలను పెంచుకుంటారు. మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. స్నేహితుల సాయంతో మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *