కవిత అసలు మాస్టర్ స్ట్రోక్ ముందుందా? అదే జరిగితే బీఆర్ఎస్‌కు కోలుకోలేని నష్టం..!

 కవిత అసలు మాస్టర్ స్ట్రోక్ ముందుందా? అదే జరిగితే బీఆర్ఎస్‌కు కోలుకోలేని నష్టం..!

కవిత అసలు మాస్టర్ స్ట్రోక్ ముందుందా? అదే జరిగితే బీఆర్ఎస్‌కు కోలుకోలేని నష్టం..!

కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీని ప్రకటించడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పేరు మార్పుతో దూరమైన ‘తెలంగాణ సెంటిమెంట్’ను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఆమె TRS అనే పేరును ఎంచుకున్నారు. అయితే పార్టీ పేరు కంటే ఆమెకు దక్కబోయే ఎన్నికల గుర్తుపైనే ఇప్పుడు ప్రధాన చర్చ సాగుతోంది. గతంలో కారు గుర్తును పోలిన గుర్తుల వల్ల భారీగా నష్టపోయిన బీఆర్ఎస్‌కు.. ఇప్పుడు కవిత పార్టీకి కారును పోలిన గుర్తు దక్కితే అది కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

హైలైట్:
కవిత ‘టీఆర్ఎస్’ మాస్టర్ స్ట్రోక్
బీఆర్ఎస్ సెంటిమెంట్‌కు గండి కొట్టే వ్యూహం!
కవిత పార్టీ గుర్తుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో గుబులు

Kavitha TRS Party

తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజలకు దగ్గరైన పేరు ‘టీఆర్ఎస్’. గులాబీ బాస్ కేసీఆర్ ఉద్యమ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో భారత్ రాష్ట్ర సమితి (BRS)గా మార్చినప్పుడు గ్రౌండ్‌ లెవల్‌లో ఒక రకమైన శూన్యం ఏర్పడింది. కవిత సరిగ్గా ఆ పాయింట్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినప్పుడే ఆ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని విమర్శిస్తూ.. మళ్ళీ అదే సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ అనే పేరు వచ్చేలా తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరును ఎంచుకున్నారు. బీఆర్ఎస్ కోర్ ఓటు బ్యాంకును, ముఖ్యంగా పాత టీఆర్ఎస్ అభిమానులను తన వైపు తిప్పుకునే ఒక మాస్టర్ ప్లాన్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పేరు సంగతి అటుంచితే కవిత పార్టీకి కేటాయించబోయే గుర్తుపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కవిత పార్టీకి ఏ గుర్తు కేటాయిస్తుందనేది ఇప్పుడు అత్యంత కీలకం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ‘కారు’ గుర్తును పోలిన ఇతర గుర్తుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. రోడ్డు రోలర్, చపాతీ రోలర్, కెమెరా, షిప్ వంటి గుర్తులు ఈవీఎం మిషన్లపై కారు గుర్తును పోలి ఉండటంతో వృద్ధులు, గ్రామీణ ఓటర్లు అయోమయానికి గురై ఆయా గుర్తులకే ఓట్లు వేశారు. దీనివల్ల అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.

ఇప్పుడు కవిత పార్టీకి గనుక కారును పోలిన గుర్తు కేటాయిస్తే.. బీఆర్ఎస్‌కు తీవ్ర నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కవిత ఇప్పటికే టీఆర్ఎస్ పేరు ద్వారా బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టేందుకు ఎత్తు వేశారని.. ఒకవేళ ఆమెకు కేటాయించే గుర్తు కూడా కారు ఆకారంలోనో, దానికి దగ్గరగానో ఉంటే ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి పడాల్సిన ఓట్లు, పొరపాటున కవిత పార్టీకి పడితే అది పరోక్షంగా కాంగ్రెస్ లేదా బీజేపీ వంటి ఇతర ప్రధాన పార్టీలకు లాభం చేకూరుస్తుందని చెబుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ కారు గుర్తును పోలిన గుర్తులపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేస్తూనే ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటికీ కారు, టీఆర్ఎస్ అంటే వేర్వేరు కావనే అభిప్రాయం ఉంది. ప్రజల మనసులో టీఆర్ఎస్ అంటేనే కారు గుర్తు అని బలంగా నాటుకుపోయి ఉంది. ఇప్పుడు కవిత TRS పేరును తన సొంతం చేసుకున్నారు. రేపు ఎన్నికల గుర్తు కారును పోలేలా, ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా ఉంటే బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చునని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా కవిత అసలు మాస్టర్ స్ట్రోక్ ముందుందని.. కారును పోలిన గుర్తును తెలంగాణ రాష్ట్ర సేనకు కేటాయిస్తే బీఆర్ఎస్‌కు కోలుకోలేని నష్టం తప్పదని అంటున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *