రాశిఫలాలు 05 ఏప్రిల్ 2026: ఈరోజు చంద్రాధి యోగం ప్రభావంతో మిథునం, తులా సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలు

horoscope today 05 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వజ్ర, చంద్రాధి యోగాల ప్రభావంతో మిథునం, తులా సహా ఈ 5 రాశులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Apr5

horoscope today 05 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు, కుజుడు, శుక్రుడి ప్రభావంతో చంద్రాధి, వజ్ర, నవ పంచమ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ కారణంగా మిథునం సహా ఈ 5 రాశులకు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలున్నాయి. కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు లభించొచ్చు. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు మీ కుటుంబంతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రయాణంలో ఉన్నప్పుడు కొన్ని శుభవార్తలు వినొచ్చు. వ్యాపారులకు ఈరోజు పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. మీ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. విద్యార్థులు మేథోపరమైన, మానసిక భారాల నుంచి ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి అధిపతిగా ఉండే శుక్రుడు ప్రభావంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి 12వ స్థానంలో ఉండటం కారణంగా ఖర్చులు కూడా పెరగొచ్చు. తులా రాశిలో చంద్రుడి సంచారం కారణంగా మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి అధిపతి అయిన బుధుడు తొమ్మిదో స్థానంలో, చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నారు. ఈరోజు మీరు చేసే ఏ పనిలో అయినా మంచి విజయం సాధిస్తారు. పనికిరాని కార్యకలాపాలపై సమయాన్ని వృథా చేయొద్దు. ఖర్చులకు తగ్గించుకోవడంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆస్తి లేదా మరేదైనా విలువైన వస్తువుల కోసం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు చట్టపరమైన పత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు గురుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. చంద్రుడు ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. దీంతో మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి అధిపతి అయిన సూర్యుడు, ఈ రాశి నుంచి అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. చంద్రుడు నాలుగో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. సమాజంలో మీకు గౌరవం పెరగనుంది. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీకు పనిభారం కూడా పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మంచి ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఇంట్లోని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారితో సంబంధాలు బలపడే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈరోజు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు ప్రత్యర్థులను ఓడించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలలో ఉండే వారికి ప్రజాదరణ లభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మరోవైపు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ మాటల్లో సంయమనం పాటించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఒక పాత స్నేహితురాలి నుంచి ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు సంతోషంగా గడుపుతారు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఈ సాయంత్రం అనుకోకుండా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఈరోజు మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు శని దేవుని అనుగ్రహంతో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి చంద్రుడు దశమ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ అద్భుతమైన పనితీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీరు చేసే పనుల్లో ఇతరుల మద్దతు పొందుతారు. ఈరోజు మీరు చేయాలనుకున్న ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు గురు గ్రహం ప్రభావంతో సానుకూల ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు చాలా రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా బిజీగా గడుపుతారు. ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

 

 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *