రాశిఫలాలు 04 ఏప్రిల్ 2026: ఈరోజు హర్ష యోగం ప్రభావంతో వృషభం, కన్య సహా ఈ 5 రాశులకు అరుదైన అవకాశాలు
Daily Horoscope in Tel Apr4
horoscope today 04 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు హర్ష, వజ్ర యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో మిథునం, కన్య సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన పరిస్థితులు లభించే అవకాశాలున్నాయి. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారు ఈరోజు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ ప్రియమైన వారిని కలిసే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు రానున్నాయి. మీ కష్టానికి శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. శని దేవుని అనుగ్రహంతో మీ బంధువులను కలిసే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో వాతవరణం సంతోషకరంగా ఉంటుంది. మీ బాధ్యతలను చాలా విశ్వాసంగా నిర్వర్తిస్తారు. మీరు ఒక కొత్త ముఖ్యమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ పొరుగువారితో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుంచి మీకు మద్దతు కూడా లభిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణం వల్ల అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. శని దేవుని అనుగ్రహంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. వ్యాపారులకు మరింత మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ మనసులో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు అనుకూలంగా ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు, సహోద్యోగులు, అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మిథున రాశిలో గురుడి సంచారం కారణంగా మీ ఆదాయం అకస్మాత్తుగా పెరగొచ్చు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలోపేత అవ్వొచ్చు. మీ వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. లేదంటే మీరు తర్వాత చింతిస్తారు. ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారు ఈరోజు ఇతరులకు సహాయం చేయడంలో మనశ్శాంతి పొందుతారు. మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేస్తారు. మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. సహోద్యోగుల కారణంగా మీ ఉత్సాహం దెబ్బతినొచ్చు. అయినప్పటికీ, మీ మంచి ప్రవర్తనతో పరిస్థితులను చక్కదిద్దుతారు. మరోవైపు ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీకు శని దేవుని ప్రత్యేక అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాల వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మీ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. మీకు స్నేహితులు, బంధువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్తారు.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. మీ మాటతీరుతో ప్రత్యేక గౌరవం పొందుతారు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా, వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రయాణాలు ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా మారతాయి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ లక్ష్యాన్ని సాధించడంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీరు పనులన్నీ చాలా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొంత ఒత్తిడి పెరగొచ్చు. మీ బంధువుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడి ఉండొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సిన డబ్బు మరింత ఆలస్యం కావొచ్చు. కోర్టు సంబంధిత విషయాల్లో మీకు అనుకూల నిర్ణయాలు రావొచ్చు. దీంతో మీరు సంతోషిస్తారు. మీ ప్రత్యర్థుల కుట్రలు విఫలమవుతాయి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడే అవకాశం ఉంది. మీరు చేసే ప్రణాళికలు విజయవంతంగా అమలు చేస్తారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ కుటుంబ బాధ్యతలు నెరవేరే అవకాశం ఉంది. ఈరోజు ఏదైనా పుణ్యక్షేత్రానికి యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఈరోజు ఏదైనా ఆస్తికి సంబంధించిన అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు శని దేవుని ప్రభావంతో ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యం బారిన పడొచ్చు. మీరు చేసే పనుల్లో కొంత ఒత్తిడి ఉండొచ్చు. మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. ఈరోజు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు దానికి సంబంధించిన అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శని దేవుని అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు ప్రారంభంలో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. శుభ యోగాల ప్రభావంతో మీ ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆస్తి సంబంధిత పనులు చేసే వారికి మంచి లాభాలు రానున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.