రాశిఫలాలు 03 ఏప్రిల్ 2026: ఈరోజు ఆదిత్య మంగళ యోగం ప్రభావంతో కర్కాటకం, తులా సహా కొన్ని రాశులకు అదృష్ట సంకేతాలు
horoscope today 03 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఆదిత్య మంగళ యోగం ప్రభావంతో కర్కాటకం, తులా సహా ఈ 4 రాశులకు విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో పురోగతి లభించొచ్చు. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. మీ కుటుంబంతో కలిసి ఏదైనా యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు కనకధార స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీకు కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయి. మీకు కొత్త ఆదాయ వనరులు లభించొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆస్తి, వాహనం లేదా ప్లాట్ కొనాలని ఆలోచిస్తుంటే, సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఊహించిన విధంగా లాభాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. వ్యాపారులు మంచి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభపద్రమైన ఫలితాలు రానున్నాయి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ మనోధైర్యం పెరుగుతుంది. అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ కోరికలలో ఒకటి నెరేవేరడం వల్ల సంతోషంగా ఉంటారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు ఈరోజు కొన్ని రుణాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు పొందొచ్చు. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బంధువులతో సంతోషంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. కష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. పెద్దల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. పెండింగులో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసేందుకు అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. మీరు పాత బకాయిలను పూర్తి చేసే అవకాశం ఉంది. మీకు కొన్ని నిత్యావసర వస్తువులను కొనాల్సి రావొచ్చు. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ వినూత్న ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం పెరగొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరి దగ్గరైనా అప్పులు చేయాల్సి రావొచ్చు. పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ వైవాహిక జీవితంలో ప్రతికూల ఫలితాలు రావొచ్చు.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు ఆసక్తి చూపుతారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. వాహనాలు, ఆస్తికి సంబంధించిన విషయాలలో మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఒక కొత్త ప్రాజెక్టును పొందే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ కారణంగా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఏదైనా కొత్త ప్రణాళిక అమలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈరోజు మీరు అనవసరమైన పెట్టుబడులకు దూరంగా ఉండాలి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.