రాశిఫలాలు 02 ఏప్రిల్ 2026: ఈరోజు ధన యోగం వేళ మేషం, మిథునం సహా ఈ రాశులకు హనుమాన్ ఆశీస్సులు

 రాశిఫలాలు 02 ఏప్రిల్ 2026: ఈరోజు ధన యోగం వేళ మేషం, మిథునం సహా ఈ రాశులకు హనుమాన్ ఆశీస్సులు

రాశిఫలాలు 02 ఏప్రిల్ 2026: ఈరోజు ధన యోగం వేళ మేషం, మిథునం సహా ఈ రాశులకు హనుమాన్ ఆశీస్సులు

horoscope today 02 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గురు పౌర్ణమితో పాటు హనుమాన్ జయంతి కూడా వచ్చింది. ఈ శుభ సమయంలో కుజుడు మీనంలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో చంద్రుడితో సప్తమ స్థానంలో ధన యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగం కారణంగా మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Apr2

horoscope today 02 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కన్యరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు కుజుడు చంద్రుడి నుంచి ఏడో స్థానంలో సంచారం చేయడం కారణంగా ధన యోగం ఏర్పడనుంది. మరోవైపు గురుడి నుంచి చంద్రుడు నాలుగో స్థానంలో ఉండటం కారణంగా గజకేసరి యోగం ఏర్పడనుంది. అంతేకాదు బుధుడు, శుక్రుడి ప్రభావంతో అధి యోగం ఏర్పడనున్నాయి. అంతేకాదు ఈ శుభ యోగాల వేళ గురు పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి వేడుకలను కూడా జరుపుకోనున్నారు. ఈ శుభ సమయంలో మేషం, మిథునం, కర్కాటకం సహా ఈ 5 రాశుల వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు కుజుడి అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. ధన యోగం కారణంగా మీకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుంచి పన్నెండో స్థానంలో కుజుడి సంచారం కారణంగా వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఓపికగా ఉన్నంతసేపు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. విలాసవంతమైన జీవితం కోసం ఎక్కువ ఖర్చులు చేయొచ్చు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మంచి ప్రజాదరణ లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ పిల్లల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు ప్రోత్సాహాకారంగా ఉంటుంది. మీ ప్రధాన కోరికల్లో ఒకటి నెరవేరొచ్చు. కొత్తగా పెళ్లైన వ్యక్తులకు సంతానానికి సంబంధించిన సమస్య పరిష్కారమవుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీరు ఓపికగా పని చేస్తే, మంచి విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. హనుమంతుడికి కుంకుమ వస్త్రాన్ని సమర్పించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు చేసే పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. కుజుడు, చంద్రుడి ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు ఈరోజు కొత్త బాధ్యతలు రావొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆదాయం కూడా పెరగొచ్చు. ఈరోజు 11సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ ప్రణాళికలన్నింటినీ క్రమశిక్షణతో పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరగొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్ర నామాలను జపించడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు చేసే ప్రణాళికలన్నీ పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ కోరికలు నెరవేరడంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు శ్రీ లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వారాంతం సమీపించడం కారణంగా మీకు కొంత పనిభారం పెరగొచ్చు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చు. మరోవైపు గురు గ్రహం ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించొచ్చు. మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి కుజుడు పంచమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు గురుడు, చంద్రుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి గురుడు సప్తమ స్థానంలో ప్రవేశించడం కారణంగా మీకు శుభ ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఈరోజు ఎవరినీ గుడ్డిగా నమ్మకండి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ప్రతికూల వార్తలు వినడం వల్ల మీరు ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
​కుంభ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులు మెరుగైన ప్రయోజనాలు పొందొచ్చు. మీరు చాలా ప్రశాంతంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఈ రాశికి అధిపతి అయిన శని దేవుడు ప్రత్యక్ష సంచారంలో ఉండటం కారణంగా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితంలో విభేదాలన్నీ తొలగిపోతాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. అయితే బంధువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. దానధర్మాలు చేయడం కారణంగా మీ ఖర్చులు పెరగొచ్చు. ఈ రాశి నుంచి గురుడు నాలుగో స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా, కొంత ప్రతికూలంగా ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *