రాశిఫలాలు 31 మార్చి 2026: ఈరోజు మేషం, మిథునం సహా కొన్ని రాశులపై వరిష్ట యోగం ప్రభావం ఎలా ఉంటుందంటే?
రాశిఫలాలు 31 మార్చి 2026: ఈరోజు మేషం, మిథునం సహా కొన్ని రాశులపై వరిష్ట యోగం ప్రభావం ఎలా ఉంటుందంటే?
horoscope today 31 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వరిష్ట, గండ యోగాల వేళ మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Mar31
horoscope today 31 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు సింహరాశి నుంచి కన్యా సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వ ఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు చంద్రుడిపై కుజుడి సప్తమ దృష్టి ఉంటుంది. అంతేకాదు చంద్రుడి సంచారం సూర్యుని నుంచి ఆరోస్థానంలో మరీ ముఖ్యంగా సూర్యుని క్షేత్రంలో జరగడం కారణంగా వరిష్ఠ యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం వేళ మేషం, తులా సహా కొన్నిరాశుల వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి లభించనుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు కుజుడి స్థానం కూడా బలంగా ఉంటుంది. శ్రీరాముని భక్తుడైన హనుమంతుని అనుగ్రహం పొందొచ్చు. ఈ కారణంగా మీకు శత్రువులు, కష్టాల నుంచి విముక్తి లభించడమే కాదు, ధైర్యం కూడా పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. మీరు చేసే పనుల్లో బిజీగా ఉంటారు. ముఖ్యంగా అకౌంటింగ్, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. మీ వైవాహిక, ప్రేమ జీవితంలో శుభప్రదంగా ఉంటుంది.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారు ఈరోజు చాలా బిజీగా గడిపే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవ్వొచ్చు. ఈరోజు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో మీరు గొప్ప ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. సాయంత్రం మీరు ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో శుభ ఫలితాలు రానున్నాయి. ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. మీకు పెద్దల నుంచి మద్దతు, మార్గదర్శకత్వం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సామరస్యం పెరుగుతాయి. మీకు స్నేహితులు, బంధువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీకు గురువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ కోరికలలో ఏదో ఒకటి నెరవేరడంతో చాలా సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక రంగాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వినిపించొచ్చు. మీ తల్లిదండ్రులపై ప్రత్యేక మద్దతు లభించే అవకాశాలున్నాయి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీకు మానసిక అశాంతి పెరగొచ్చు. మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. మీకు బంధువుల నుంచి కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం మానేయడం మంచిది. కంటికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే, వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను పొందే అవకాశాలున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మీ తల్లిదండ్రుల నుంచి అపారమైన మద్దతు,సంతోషం లభిస్తుంది. మరోవైపు మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే వ్యాపారులకు మంచి ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీ పని ప్రణాళికలు బాగుంటాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన క్షణాలు గడపొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. రాజకీయ రంగాలలో ఉండే వ్యక్తులకు సానుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీ మనసులో అశాంతి ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించాలనే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అయితే సాయంత్రం వరకు ఓపికగా ఉండటం కారణంగా మీ పనులన్నీ తెలివిగా పూర్తి చేసే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులను ఓడించడంలో విజయం సాధిస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు పని చేసే చోట మార్పు గురించి ఆలోచిస్తారు. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టుల నుంచి లాభాలు రావొచ్చు. మీ తండ్రి, పూర్వీకుల నుంచి సంపద పెరిగే అవకాశం ఉంది. మీకు విదేశీ సంబంధిత పనులలో లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు విలువైన వస్తువులను పొందే అవకాశాలున్నాయి. అయితే మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. మీకు బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు తమ వ్యాపారంపై ఆసక్తి పెరగొచ్చు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో మీకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు కొన్ని వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ కారణంగా మీకు ఎక్కువ ఆదాయం లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీరు సన్నిహితులను కలుసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో పని చేసే వ్యక్తులు మంచి విజయం సాధిస్తారు. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు గురు గ్రహం ప్రభావంతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఉన్న వివాదాల నుంచి ఉపశమనం లభించొచ్చు. ఈరోజు మీరు ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.