రాశిఫలాలు 29 మార్చి 2026: ఈరోజు మేషం, కుంభం సహా కొన్ని రాశులకు ధృతి యోగం ప్రయోజనాలు
రాశిఫలాలు 29 మార్చి 2026: ఈరోజు మేషం, కుంభం సహా కొన్ని రాశులకు ధృతి యోగం ప్రయోజనాలు
horoscope today 29 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ధృతి యోగం ప్రభావంతో మేషం, కుంభం సహా కొన్ని రాశులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel29
horoscope today 29 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు కుజుడు, చంద్రుడు ప్రభావంతో మేషం, కుంభం సహా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ధృతి, శూల యోగాల ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. సూర్యుడి బలమైన స్థానం కారణంగా సూర్య దేవుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ కారణంగా సమాజంలో గౌరవం లభించే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు శుభ యోగాల కారణంగా ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశికి అధిపతి అయిన కుజుడు అనుకూల స్థానంలో ఉండటంతో మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. ఉన్నత విద్యకు సంబంధించి శుభవార్తలు వింటారు. పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు పాత పెట్టుబడుల నుంచి అధిక రాబడి లభించే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు పన్నెండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో రాజకీయాల్లో ఉండే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కొత్తగా ఏదైనా పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రాశి వారికి అధిపతి అయిన బుధుడి ప్రభావంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మరోవైపు తొమ్మిదో స్థానం నుంచి రాహువు సంచారం చేయడం కారణంగా మీకు సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ పిల్లల వైపు నంచి శుభవార్తలు వినొచ్చు. ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం తినడం మానేయాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. శుభకార్యాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీ పిల్లల వివాహాలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడి ప్రభావంతో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు చంద్రుడి అనుగ్రహం కారణంగా శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో లేదా రాజకీయ సంబంధిత రంగాల్లో పని చేసే వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. ఒక కొత్త పరిచయం స్నేహంగా మారొచ్చు.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చంద్రుడి ప్రభావంతో మీకు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు కుజుడి ప్రభావంతో మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు ఈ రాశి నుంచి సప్తమ స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు మిథునంలో గురుడి ప్రత్యక్ష రవాణా కారణంగా అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితాలు రాకపోవచ్చు. మీ ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. మీ రహస్య శత్రువులు చురుగ్గా ఉంటారు. మీ కుటుంబంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. అయితే సూర్యాస్తమయం సమయంలో కొంత ఉపశమనం లభిస్తుంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. మీ ఖర్చులను నియంత్రించే అవకాశం ఉంది. ఈరోజు మీ ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు. వ్యాపారులకు ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. పనికి సంబంధించి కొత్త ప్రాజెక్టులలో పని చేసే అవకాశం మీకు లభిస్తుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే అవకాశాలున్నాయి. మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభించే అవకాశం ఉంది.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో శుభపద్రంగా ఉంటుంది. మీరు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇది మీ నిర్ణయాలపై సానుకూల ప్రభావాన్ని చూపొచ్చు. ఉన్నత విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. విదేశీ వాణిజ్యం చేసే వారు అధిక లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈరోజు మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మీ కష్టమైన పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. కొత్త పనులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు అధిపతి అయిన శని దేవుడు ఈ రాశి నుంచి మూడో స్థానంలో ప్రత్యక్ష సంచారం చేస్తున్నప్పటికీ, దైనందిన జీవితానికి కారకుడైన చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా మీకు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు కొందరు ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశాలున్నాయి. మీ ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నతాధికారుల సహకారంతో పరిష్కరించబడతాయి. మీ ఆరోగ్యం క్రమంగా క్షీణించొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు అనేక లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు భాగస్వామి, స్నేహితుల సాయంతో చేసే పనుల వల్ల మంచి అవకాశాలొస్తాయి. ఉద్యోగులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు లాటరీ లేదా స్టాక్ మార్కెట్లో లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. ఈరోజు మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలొస్తాయి. మీ తోబుట్టువులతో వివాదాలను నివారించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి అధిపతి అయిన గురుడు ప్రస్తుతం మిథున రాశిలో నాలుగో స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు. మరోవైపు చంద్రుడు కూడా లక్ష్మీదేవి నివాసమైన పంచమ త్రికోణంలో ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలున్నాయి. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు సానకుూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు తమ పెట్టుబడికి తగిన రాబడి లభించే అవకాశం ఉంది.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.