రాశిఫలాలు 27 మార్చి 2026: ఈరోజు రాజరాజేశ్వర యోగం ప్రభావంతో కర్కాటకం, వృశ్చికం సహా కొన్ని రాశుల వారు ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు

 రాశిఫలాలు 27 మార్చి 2026: ఈరోజు రాజరాజేశ్వర యోగం ప్రభావంతో కర్కాటకం, వృశ్చికం సహా కొన్ని రాశుల వారు ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు

రాశిఫలాలు 27 మార్చి 2026: ఈరోజు రాజరాజేశ్వర యోగం ప్రభావంతో కర్కాటకం, వృశ్చికం సహా కొన్ని రాశుల వారు ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు

horoscope today 27 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శుక్రుడు, చంద్రుడి ప్రభావంతో రాజ రాజేశ్వరి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం కారణంగా వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు ఈరోజు ఏదైనా బ్యాంకు లేదా సంస్థ నుంచి ఆలోచించి రుణం తీసుకోవాలి. మీకు పాత స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ మంచి స్నేహితుల వలయం కూడా పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఈ సాయంత్రం మీ కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఈరోజు మీరు చేసే ఆర్థిక ప్రయత్నాల్లో మంచి విజయం సాధించొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. మీ కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మీరు చేసే పనుల్లో ఆటంకం కలగొచ్చు. మీరు ఆధ్యాత్మికం, మతం పట్ల ఆసక్తి చూపుతారు. మీ పిల్లల నుంచి ప్రోత్సాహకరమైన వార్తలు అందుతాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు మీకు సంగీతం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు రాజరాజేశ్వర యోగం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో అధికారుల నుంచి సహకారం, మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు ఒక బహుమతి కూడా లభించొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీకు మానసిక ప్రశాంతత లభించకపోవచ్చు. మరోవైపు మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. మీకు బంధువుల నుంచి ప్రశంసలు లభించొచ్చు. మీ మాటతీరుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీకు కంటికి సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే, అవి తప్పకుండా మెరుగుపడతాయి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారు ఈరోజు చాలా నిర్భయంగా ఉంటారు. మీరు కష్టమైన పనులను ధైర్యంగా పూర్తి చేసే అవకాశం ఉంది. మీకు తల్లిదండ్రుల నుంచి అపారమైన మద్దతు లభించే అవకాశం ఉంది. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశం ఉంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి నుంచి దశమ స్థానంలో చంద్రుడు సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో కొన్ని మంచి అవకాశాలు లభించొచ్చు. ఒక స్నేహితుడు లేదా సహోద్యోగి మీకు సహాయం చేయగలరు. మీకు తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు లక్ష్మీ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు తాము చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఈరోజు మీరు శత్రువులను ఓడించే అవకాశం ఉంది. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయం సాధించొచ్చు.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
​ధనస్సు రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీ తెలివితేటలతో అనేక పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేస్తారు. మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు రావొచ్చు. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
​మకర రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో, సన్నిహితులతో సంయమనం పాటించాలి. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆర్థిక ప్రణాళికల నుంచి మంచి ప్రయోజనం పొందొచ్చు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. శుభ యోగం కారణంగా పెండింగులో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు, అనుభవం కారణంగా వ్యాపారులు మంచి ప్రయోజనాలు చేకూరనున్నాయి. బ్యాంకింగ్ సంబంధిత పనులలో విజయం సాధించే అవకాశం ఉంది. మార్కెటింగ్ రంగంలో ఉండే వ్యక్తులు ఒక మంచి ఒప్పందాన్ని కుదుర్చుకుని సంతోషిస్తారు. కోర్టు కేసులు, వివాదస్పద విషయాలలో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశికి అధిపతి అయిన గురు గ్రహం ప్రస్తుతం మిథునంలో అంటే నాలుగో స్థానంలో ఉండటం కారణంగా మీకు కొన్ని సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా గడిపే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో, కుటుంబ సభ్యులతో సరదాగా, నవ్వుతూ గడుపుతారు. మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడే అవకాశాలున్నాయి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *