రాశిఫలాలు 22 మార్చి 2026: ఈరోజు ప్రీతి యోగం వేళ మిథునం, సింహం సహా ఈ 4 రాశులకు ఆర్థిక లాభ సూచనలు

 రాశిఫలాలు 22 మార్చి 2026: ఈరోజు ప్రీతి యోగం వేళ మిథునం, సింహం సహా ఈ 4 రాశులకు ఆర్థిక లాభ సూచనలు

రాశిఫలాలు 22 మార్చి 2026: ఈరోజు ప్రీతి యోగం వేళ మిథునం, సింహం సహా ఈ 4 రాశులకు ఆర్థిక లాభ సూచనలు

horoscope today 22 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు విష్కంభ, ప్రీతి యోగాల ప్రభావం మిథునం, సింహం సహా ఈ 5 రాశులకు మంచి విజయం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Mar22

horoscope today 22 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు, చంద్రుడు శుక్రుడి, బుధ గ్రహాల ప్రభావంతో విష్కంభ, ప్రీతి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ కారణంగా మిథునం, సింహం సహా ఈ 5 రాశులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. కొన్ని రాశుల వారికి శివయ్య ఆశీస్సులు లభించొచ్చు. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి అధిపతి అయిన కుజుడు పదకొండవ ఇంట్లో సంచార చేయనున్నాడు. మరోవైపు ఇదే రాశిలో చంద్రుడి సంచారం కారణంగా మీ విలాసాల పట్ల కోరికలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు కొన్ని కొత్త మార్పులు చేయొచ్చు. దీని వల్ల మీకు భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి నుంచి చంద్రుడు ఈరోజు పన్నెండో స్థానంలో సంచారం చేయడం కారణంగా మీకు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడొచ్చు. మీ కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించకపోవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాక, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు ఇతరుల నుంచి కొంత మద్దతు లభిస్తుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారు ఈరోజు తమ పనులన్నీ అంకితభావంతో పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ కారణంగా పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులు ఈరోజు కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెడతారు. మరోవైపు మీ కుటుంబంలో మనస్పర్థలు ఉంటాయి. సాయంత్రం మీ వాహనం కారణంగా వలన ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ఈ సమయంలో ఓర్పుగా ఉండాలి. ఎందుకంటే తొందరపాటు చర్యలు మీకు ఇబ్బందులను కలిగించొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారు ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక పరంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. కొత్త విషయాలను కనుగొనడంలో, మీరు విజయం సాధిస్తారు. మీరు చేసే కొత్త ప్రయత్నాల్లో కూడా సక్సెస్ సాధించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభించే అవకాశాలున్నాయి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు సూర్య, చంద్రుల అనుగ్రహంతో అనేక రంగాల్లో మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు సొంత విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు సహాయం కూడా చేస్తారు. మీ మాటతీరుతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఈరోజు సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు, మతం, ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి చూపుతారు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి నుంచి ఈరోజు చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం లభించొచ్చు. సమాజంలో మీకు గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మీ ఇష్టానికి విరుద్ధంగా పనులు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీకు అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా కొంత బలహీనంగా ఉంటుంది. మీకు ప్రభుత్వం నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. మీరు కుటుంబం నుంచి శుభవార్తలు పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీ ధైర్యసాహసాలను అందరూ ప్రశంసిస్తారు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. నాలుగో స్థానంలో ఉన్న కుజుడి కారణంగా ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చుల కారణంగా మీకు అసంతృప్తిని మరింత పెంచొచ్చు. సాయంత్రం వచ్చే శుభవార్త మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. రాత్రి పూట ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం లభించొచ్చు. కుజుడిని శాంతపరచేందుకు కుజ మంత్రాలను పఠించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు ఆధ్యాత్మిక పరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే అవకాశాలున్నాయి. మరోవైపు సప్తమ స్థానంలో ఉన్న గురుడు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చు. కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక నియంత్రణ పాటిస్తూ మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు అష్టమ స్థానంలో కేతువు, సూర్యుడు, కుజుడు, శుక్రుడి కలయిక, నాలుగో మధ్య స్థానంలో చంద్రుడు ఉండటం కారణంగా మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశ ఉంది. ఈరోజు మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవ్వొచ్చు. శుక్రుడి ప్రభావంతో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు సమయం దైవారాధన, తపస్సు, దానధర్మాలకు సమయం కేటాయించొచ్చు.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి మీకు కొత్త అవకాశాలు లభించొచ్చు. ఈరోజు ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో ఎక్కువ ఆసక్తి పెంచుకోవచ్చు. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు పెద్దల ఆశీస్సులతో మీ పనిలో విజయం సాధిస్తారు. సాయంత్రం కొన్ని వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్డొంటారు.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి నుంచి రాహువు పన్నెండో స్థానంలో సంచారం కారణంగా కొన్ని ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. శత్రువుల విషయంలో కొంత ఆందోళన పెరగొచ్చు. మీకు మానసిక ప్రశాంతత తగ్గిపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో మీరు కొన్న సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మరోవైపు ఉద్యోగులకు అనేక రంగాల్లో ప్రయోజనం లభించే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ గురించి శుభవార్తలు రానున్నాయి. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *