రాశిఫలాలు 13 మార్చి 2026: ఈరోజు మాళవ్య రాజయోగం వేళ కర్కాటకం, తులా సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు
రాశిఫలాలు 13 మార్చి 2026: ఈరోజు మాళవ్య రాజయోగం వేళ కర్కాటకం, తులా సహా ఈ 5 రాశులకు అదృష్ట సంకేతాలు
horoscope today 13 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మాళవ్య రాజయోగం వేళ కర్కాటకం, సింహం సహా ఈ 5 రాశులకు అదృష్టం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Mar13
horoscope today 13 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు పగలు, రాత్రి ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు మీన రాశిలో శుక్రుడు ఉన్నత స్థానంలో ఉండటం కారణంగా మాళవ్య రాజయోగం ఏర్పడనుంది. దీంతో పాటు చంద్రుడి ప్రభావంతో గజకేసరి యోగం ఏర్పడనుంది. మకరంలో సూర్యుడు, కుజుడు, బుధుడు సంచారం చేయనున్నారు. ఈ కారణంగా మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈరోజు మీ కోరికలన్నీ నెరవేరొచ్చు. కెరీర్ పరంగా సానుకూల మార్పులకు అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. మీ ప్రేమ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారు ఈరోజు తమ ప్రవర్తన, మాటల్లో సంయమనం పాటించాలి. ఎందుకంటే ఏదైనా చిన్న విషయం పెద్ద వివాదంగా మారొచ్చు. ఈరోజు మీ ఖర్చులపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగుల నుంచి కొన్ని ఆటంకాలు ఏర్పడొచ్చు. అయితే ఈ సమయంలో చాలా ఓపికగా ఉండాలి. ఈ రాశి నుంచి గురుడు రెండో స్థానంలో సంచారం చేయడం కారణంగా సాయంకాలం కొన్ని శుభవార్తలు వింటారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. గురుడు లగ్న స్థానంలో ఉండటం కారణంగా మీ మేథస్సు పెరిగే అవకాశం ఉంది. దశమ స్థానంలో శుక్రుడి సంచారం కారణంగా కెరీర్ పరంగా మంచి విజయం సాధించొచ్చు. ఈరోజు కొత్త ఆదాయ వనరులు పొందొచ్చు. మీ పనులన్నీ సులభంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. అయితే విద్యార్థులు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి చంద్రుడు ఆరో స్థానంలో ఉంటాడు. మరోవైపు చంద్రుడిపై గురుడి దృష్టి కారణంగా మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం లభించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సంబంధిత పనులు, ముఖ్యంగా రుణాలు కోరుకునే వారు మంచి విజయాన్ని సాధించొచ్చు. విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు గొప్ప విజయాలు సాధించొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ తోబుట్టువుల నుంచి అన్ని పనులకు మద్దతు లభిస్తుంది.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా గడిపే అవకాశం ఉంది. మీ పనులన్నీ సులభంగా పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యమైన పనులను వాయిదా వేయకూడదు. మీ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఆస్తికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. కెరీర్ పరంగా పురోగతి సాధించాలంటే మరింత కష్టపడాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు బుధుడి తిరోగమనం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కొంత నష్టాలు రావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ ఆస్తి లేదా స్థిరాస్తికి సంబంధించిన పెట్టుబడుల కారణంగా లాభాలు ఆశించొచ్చు. అయితే అనవసరమైన ఖర్చులను నివారించాలి. మీ కొత్త పొదుపు ప్రణాళికలు విజయవంతం అవుతాయి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజంతా మీరు చాలా ఉత్సాహం, శక్తితో నిండి ఉంటారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు కొన్ని కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు. సూర్యుడు, కుజుడు కలిసి ఉండటం కారణంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు కూడా లభించే అవకాశం ఉంది. మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందొచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి నుంచి రెండో స్థానంలో చంద్రుడి సంచారం కారణంగా మీకు అనేక రంగాల్లో మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభించొచ్చు. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి కొన్ని సానుకూల వార్తలు అందొచ్చు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశిలో ఈరోజు పగలు, రాత్రి చంద్రుడు సంచారం చేయడం కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ పెండింగ్ ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. మీరు ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశాలున్నాయి. దీర్ఘకాలిక భవిష్యత్తు ప్రాజెక్టు కోసం మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మహాలక్ష్మీ దేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలొస్తాయి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు క్లిష్ట పరిస్థితుల నుంచి సులభంగా బయటపడొచ్చు. విదేశాలలో పని చేసే వారికి సానుకూల ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులన్నీ విజయవంతం అవ్వొచ్చు. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులలో పని చేసేందుకు అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీరు చేసే ఖర్చులు మీ బడ్జెట్ను ప్రభావితం చేయొచ్చు.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. అయితే మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం ఉంది. అయితే తొందరపడకూడదు. రాహువు ప్రభావం కారణంగా ఆర్థిక పరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఆచితూచి అడుగులు వేయాలి. మీ పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి నుంచి ఈరోజు చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. అంతేకాదు ఇదే రాశిలో శుక్రుడు మాళవ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ కారణంగా కెరీర్ పరంగా మీకు మంచి పురోగతి లభించొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో ఏవైనా విభేదాలుంటే, వాటిని పరిష్కరించడంలో మంచి విజయం సాధిస్తారు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.