Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 06 ఎపిసోడ్: ‘మీనాకు అన్యాయం చేయొద్దరా బాలు’ ప్రభావతి మనసులో కోడలిపై ఇంత ప్రేమా!

Gunde Ninda Gudi Gantalu 2026 April 06 Episode: ప్రభావతి డబ్బుకి లొంగడంతో.. మొత్తానికీ శివ అరెస్ట్ సంగతి కాస్త సద్దుమణిగింది. అయితే రోహిణీకి ప్రభావతి కేసు వెనక్కి తీసుకోవడంపై అనుమానం రావడంతో ‘కామాక్షీ పిన్నిని అడిగి తెలుసుకోవాలి’ అని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే నేటి (ఏప్రిల్ 06) కథనంలో రోహిణీ నిజం తెలుసుకోవడానికి కామాక్షీ ఇంటికి వెళ్తుంది. అక్కడ నిజం ఎలా
Gunde Ninda Gudi Gantalu 2026 April 06 Episode (photo courtesy by star maa and JioHotstar)
గుండెనిండా గుడిగంటలు సీరియల్ (photo courtesy by star maa and JioHotstar)
Gunde Ninda Gudi Gantalu 2026 April 06 Episode: ఒకవైపు మీనా.. బాలుతో.. ‘మీరు మా తమ్ముడి కోసం చాలా అప్పు చేశారు.. దాన్ని తీర్చాలంటే మనం ఇద్దరం కష్టపడదాం.. మీరు ఎక్కువ సేపు ట్రిప్‌లు వేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు.. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం పెళ్లిళ్ల డెకరేషన్‌కి పువ్వులు సప్లై చేస్తే డబ్బులు త్వరగా సంపాదించొచ్చు కదా?’ అంటుంది. ఐడియా బాగుంది.. ప్రయత్నిద్దాం అంటాడు బాలు. ఇక మరునాడు ఉదయానికి మీనా.. డెమో కోసం నిజంగానే ఒక బొమ్మల పెళ్లి మండపాన్ని పువ్వులతో డెకరేట్ చేస్తుంది. అది చూసి బాలు మురిసిపోతాడు. చాలా బాగుంది అని పొగుడుతాడు. దీన్ని తెలిసిన వాళ్లకు చూపిస్తే మనకు బేరాలు వస్తాయిలే అనుకుంటారు. అప్పుడే షాపింగ్ చేసి వచ్చిన శ్రుతి.. అది చూసి.. మీనా ఐడియా తెలుసుకుని సూపర్ అని పొగుడుతుంది. ‘అయితే ఇలా డిమోలు చేసి.. మౌత్ టాక్‌తో డెవలప్మెంట్ వేగంగా ఉండదని.. వేగంగా డెవలప్ కావాలంటే.. సోషల్ మీడియాలో ప్రచారం అవసరం అని చెబుతుంది. బాలు కూడా ‘డబ్బు డమా ఐడియా బాగుంది’ అంటాడు. అయితే మీనా.. ‘సోషల్ మీడియాలో నేను ప్రమోషన్ చేయడం ఏంటీ.. నాకు సిగ్గు.. పైగా ఇవన్నీ మనకు అవసరమా?’ అంటుంది. అయితే బాలు, శ్రుతి ఊరుకోరు. ఎంక్రేజ్ చేస్తారు బాగా.

నీకు నా సారీ కట్టి రెడీ చేస్తాను రా మీనా.. శ్రుతి ప్రేమ..

నీకు నా సారీ కట్టి రెడీ చేస్తాను రా మీనా.. శ్రుతి ప్రేమ..

నీకు నా సారీ కట్టి రెడీ చేస్తాను రా మీనా.. శ్రుతి ప్రేమ..
శ్రుతి అయితే.. మీనాతో.. ‘మీనా.. ఈ పెళ్లి మండపం డెకరేషన్ డెమోతో పాటుగా నీ ఫొటోస్ కూడా అవసరమే.. అయినా ఈ లుక్‌లో కాదు.. నేను సారీ తెచ్చుకున్నాను.. ఒకటి నీకు కడతాను పదా.. రెడీ చేస్తాను. అప్పుడు నువ్వే స్వయంగా సోషల్ మీడియాలో నీ ఐడియాను చెప్పొచ్చు.. పదపదా’ అంటూ బలవంతంగా గదిలోకి తీసుకుని వెళ్తుంది. బాలు కూడా ‘వెళ్లు మీనా’ అని పంపిస్తాడు. ఇక మరోవైపు రోహిణీ.. కామాక్షీ ఇంటికి వెళ్లి.. ‘పిన్నీ నన్ను కూతురులా అంటుంటావ్ కదా.. అందుకే నీకు మసాజ్ చేద్దామని వచ్చాను’ అంటూ.. కామాక్షిని ఐస్ చేసే పనిలో పడుతుంది.

నిజం కక్కిన కామాక్షి..
నిజం కక్కిన కామాక్షి..

నిజం కక్కిన కామాక్షి..
ఇక రోహిణీ.. మెల్లగా కామాక్షిని మాటల్లో పెట్టి.. ‘అసలు మా అత్తయ్య శివ మీద అంత తేలికగా కేసు ఎలా వెనక్కి తీసుకుంది?’ అంటూ ఆరా తీస్తుంది. ‘ఊరికే ఎందుకు కేసు వెనక్కి తీసుకుంది.. లాయర్ ఇచ్చిన రెండు లక్షలకు లొంగిపోయి కేసు వెనక్కి తీసుకుంది’ అనేస్తుంది కామాక్షి. వెంటనే బిత్తరపోయి.. ‘ఊరికే అలా అన్నాను’ అంటూ కవర్ చేసుకునే పనిలో పడుతుంది కామాక్షి. కానీ రోహిణీ వదిలిపెట్టదు. ‘పిన్నీ నా దగ్గర కూడా నిజం దాస్తారా?’ అంటూ కాకా పట్టడంతో.. జరిగింది చెబుతుంది. ‘నేను నమ్మలేకపోతున్నా’అంటుంది రోహిణీ.

రెండు లక్షలు దాచిన చోటుని చెప్పిన పిచ్చి కామాక్షి..

రెండు లక్షలు దాచిన చోటుని చెప్పిన పిచ్చి కామాక్షి..
‘నీకు నమ్మేలా నేను సాక్ష్యం చూపిస్తాను రా’ అని కామాక్షీ.. వెంటనే రోహిణీని కిచెన్‌లోకి తీసుకెళ్లి.. పోపుల డబ్బాలు ఓపెన్ చేసి.. రూ.2 లక్షల కట్టలు చూపించి.. ‘ఇదిగో ఇవే లాయర్ ఇచ్చిన డబ్బు.. ఈ రెండు లక్షలకే మీ అత్త కేసు వెనక్కి తీసుకుంది’ అని చెబుతుంది. దాంతో రోహిణీ.. ‘అత్తయ్యను పడగొట్టాలంటే డబ్బు విసిరితే సరిపోతుందనిమాట’ అని ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక కాసేపటికి గుణ.. రోహిణీకి కాల్ చేసి.. ‘రెండు లక్షలు తెస్తున్నావా? ఈ దినేష్ గాడ్ని పూడ్చి కేసు నా మీదకు రాకుండా చేసుకోవాలా?’ అంటూ బెదిరిస్తాడు.

రెండు లక్షలు ఇస్తావా? వాడ్ని పూడ్చేయాలా?

రెండు లక్షలు ఇస్తావా? వాడ్ని పూడ్చేయాలా?
‘లేదు లేదు డబ్బు ఇస్తాను.. వాడ్ని కేరళ పంపించి వైద్యం చేయిద్దాం’ అంటుంది రోహిణీ. ‘త్వరగా ఆ పని చెయ్’ అని ఫోన్ పెట్టేస్తాడు గుణ. ఇక అప్పటికే విద్యతో కామాక్షి చెప్పిన రహస్యాన్ని షేర్ చేసుకుంటున్న రోహిణీ.. ‘మనం ఆ రెండు లక్షలు కొట్టెయ్యాలి.. ఆ డబ్బునే గుణకు ఇచ్చి సమస్య నుంచి బయటపడాలి’ అని తన ఆలోచనను విద్యతో చెబుతుంది. అదెలా? అంటుంది విద్య. ‘సింపుల్.. మనిద్దరం కామాక్షి పిన్ని ఇంటికి వెళ్దాం.. మా అత్తయ్య డ్యాన్స్ గురించి నువ్వు తక్కువగా మాట్లాడినట్లు చెప్పి.. అందరినీ డ్యాన్స్ చేసేలా చేస్తాను.. ఆ టైమ్‌లో నువ్వు వెళ్లి డబ్బు కొట్టెయ్’ అంటుంది. సరే అని విద్య చెబుతుంది.

కామాక్షి ఇంట్లో విద్య దొంగతనం..

కామాక్షి ఇంట్లో విద్య దొంగతనం..
ఇక విద్య, రోహిణీలు ప్రభావతి డ్యాన్స్ స్కూల్‌కి వెళ్తారు. అక్కడ కామాక్షిని, ప్రభావతిని రోహిణీ మాటల్లో పెడుతుంది. ‘మా అత్తయ్య డ్యాన్స్ మామూలుగా చేయదు.. కావాలంటే రూ.5వేలు బెట్ కాస్తాను… ఓడిపోతావ్ చూసుకో విద్యా’అంటూ నాటకం స్టార్ట్ చేస్తుంది. ఇక స్టూడెంట్స్ కూడా ప్రభావతిని ఎంక్రేజ్ చేస్తారు. కామాక్షీ చూస్తుండగానే ప్రభావతి.. తెగ డ్యాన్స్ చేసేస్తుంది. ఇక అది అదునుగా చూసిన విద్య.. జాగ్రత్తగా కిచెన్‌లోకి వెళ్లి.. పోపు డబ్బాలు వెతికి.. రెండు లక్షలు కొట్టేస్తుంది. వెంటనే ఏం తెలియని దానిలా తిరిగి వచ్చి.. ‘ప్రభావతి ఆంటీ డ్యాన్స్ సూపర్.. నువ్వే గెలిచావ్ రోహిణీ’అంటూ రూ.5 వేలు చేతిలో పెడుతుంది. డబ్బు కొట్టేసిన సంగతి కామాక్షికి కూడా తెలియకుండా కొట్టేశారు ఇద్దరూ.

అవన్నీ నీకు అవసరం లేదు గుణ.. రోహిణీ ఫైర్..

అవన్నీ నీకు అవసరం లేదు గుణ.. రోహిణీ ఫైర్..
ఇక ఆ డబ్బు తీసుకుని గుణ దగ్గరకు వెళ్తారు ఇద్దరూ. ‘ఆ దినేష్ గాడ్ని కేరళా వైద్యానికి పంపించి.. నా జోలికి రాకుండా చెయ్ గుణ’ అని రిక్వస్ట్ చేస్తుంది రోహిణీ. ‘అది నేను చూసుకుంటాను.. కంగారుపడొద్దు.. డబ్బు ఇచ్చావ్ కదా’ అని చెబుతూనే.. ‘అవును ఆ దినేష్ గాడికి ఎందుకు అంతగా భయపడుతున్నావ్.. నీకు సంబంధించిన ఏ రహస్యం గురించి నువ్వు భయపడుతున్నావ్?’ అని మాట కలుపుతాడు. ‘అవన్నీ నీకు అనవసరం.. ముందు పని పూర్తి చెయ్యమని’ చెప్పి.. విద్యను తీసుకుని రోహిణీ వెళ్లిపోతుంది. వెంటనే దినేష్ నవ్వుతూ వచ్చి.. ‘నా వాటా నాకివ్వు అన్నా’అంటాడు.

దినేష్‌ని వదిలేసిన గుణ..

దినేష్‌ని వదిలేసిన గుణ..
దినేష్ రాగానే రూ.75 వేలు వరకూ వాడికి డబ్బు ఇచ్చి.. ‘రెండు మూడు నెలలు నువ్వు కనిపించకు.. మిగిలిన కథ నేను నడిపిస్తాను.. ఈ రోహిణీ మనకు బంగారు బాతు.. దాని నుంచి డబ్బు ఎలా లాగాలో నాకు బాగా తెలుసు.. నువ్వు వెళ్లు’ అంటాడు దినేష్‌తో గుణ. దాంతో దినేష్.. ‘సరే అన్నా పోయి వస్తాను.. నువ్వు ఏం చెబితే అదే చేస్తాను ఇక నుంచి’ అనేసి దినేష్ వెళ్లిపోతాడు. మరోవైపు.. మీనాను చాలా అందంగా రెడీ చేసి తీసుకొస్తుంది శ్రుతి. ఆ అందాన్ని చూసి బాలు మురిసిపోతాడు. పొంగిపోతాడు

బాలు రొమాన్స్..

బాలు రొమాన్స్..
శ్రుతి.. మీనాకు ఫొజులు ఇవ్వడం నేర్పిస్తుంది. స్టైల్‌గా నడవడం నేర్పిస్తుంది. ఆ తర్వాత.. తన ఐడియా గురించి మీనా.. సిగ్గు పడుతూనే వీడియోకి మాట్లాడుతుంది. బాలు కూడా బాగా ఎంక్రేజ్ చేస్తాడు మీనాని. ఇంతలో రవి వస్తాడు. సూపర్ వదినా అంటూ.. తనకు తెలిసిన ఐడియా తాను చెబుతాడు. ఇలా నిలబడు.. అలా మాట్లాడు అంటూ.. బాలు, శ్రుతి, రవీలు చెబుతుంటారు. ఇక కాసేపటి తర్వాత బాలు, మీనాలకు కలిసి ఫొటోలు తీయడం స్టార్ట్ చేస్తుంది శ్రుతి. మెట్ల మీద నుంచి తీస్తాను మీరిద్దరూ అలా రొమాంటిక్‌గా ఉండండి అని రవితో పాటు మెట్లు ఎక్కుతుంది శ్రుతి. అయితే అప్పుడే వచ్చిన రోహిణీ, ప్రభావతీలకు.. మీనా, బాలులు రొమాంటిక్‌గా ఉండటం చూస్తారు. వాళ్లకు గుమ్మం దగ్గర నుంచి చూస్తే బాలు, మీనాను లిప్ కిస్ చేస్తున్నట్లు ఉంటుంది.

ప్రభావతికి మీనాపై ప్రేమ.. ఆట ఆడేసుకున్న బాలు..

ప్రభావతికి మీనాపై ప్రేమ.. ఆట ఆడేసుకున్న బాలు..
అయితే ఆ చీర కట్టుకున్న అమ్మాయి మీనా అనుకోదు ప్రభావతి. వెనక్కి తిరిగి ఉండటం చూసి.. ‘రేయ్ బాలుగా ఏంట్రా ఈ పనులు.. ఎవర్తిని తీసుకొచ్చావ్ ఇంటికి? ఆ పాడు పనులు ఏంటీ?’ అని అరుస్తూ దగ్గరకు వెళ్తుంది. శ్రుతి, రవీలు మెట్లుపైనే ఉండి అంతా చూసి నవ్వుకుంటారు. బాలుకి విషయం అర్థమై.. ‘నా ఇష్టం.. ముంభై నుంచి వచ్చి మోడల్ తను.. నచ్చింది అందుకే ఇలా’ అంటూ ప్రభావతికి రోత పుట్టిస్తాడు. ‘అయ్యో మీనా.. ఎక్కడ చచ్చావే.. నీ జీవితం నాశనం అయిపోతుంది త్వరగా రావే.. మీనా.. వాడు ఎవర్తినో తెచ్చుకున్నాడు’ అని లబోదిబోమంటుంది ప్రభావతి. ఇక చివరికి ఆ అమ్మాయే మీనా అని తెలిసి.. ప్రభావతి బిక్కముఖం వేస్తుంది. అప్పుడే మీనా.. ‘అత్తయ్యా మీకు నా మీద ఇంత ప్రేమ ఉందా.. ఆయన నా జీవితం నాశనం చేస్తారని మీరు ఇంతగా తపించారా?’ అంటుంది. వెంటనే ప్రభావతిలో అత్తవతి వచ్చి వాలినట్లు.. ‘హే ఛీ.. నీ మీద నాకు ప్రేమేంటీ? వాడు ఏదో పాడు పని చేస్తున్నాడని అలా పిలిచానంతే’ అని కవర్ చేసుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. ఆ సీన్ భలే కామెడీగా సాగింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *