రాశిఫలాలు 01 ఏప్రిల్ 2026: ఈరోజు అమల యోగం ప్రభావంతో వృషభం, మిథునం సహా ఈ రాశులకు లాభాలు

horoscope today 01 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వృద్ధి, అమల యోగాల వేళ వృషభం, మిథునం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in April1

horoscope today 01 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు కన్యరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తర ఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు చంద్రుడు, గురు గ్రహాల మధ్య ప్రత్యేకమైన కూటమి ఏర్పడనుంది. ఈ కారణంగా గజకేసరి, అమల యోగాలు ఏర్పడనున్నాయి. దీంతో పాటు సూర్యుడు, చంద్రుడి మధ్య 180 డిగ్రీల కోణంలో సమసప్తక కూటమి ఏర్పడనుంది. మరోవైపు బుధుడు పూర్వభాద్ర నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఈ శుభ యోగాల ప్రభావంతో మిథునం సహా కొన్ని రాశుల వారికి మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు కుజుడి అనుగ్రహంతో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. చంద్రుడి బలమైన సంయోగం కారణంగా మీరు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి సాధించొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభించనుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు. ఈ కారణంగా మీకు పదోన్నతి లభించొచ్చు. మీరు కొత్త బాధ్యతలు కూడా పొందే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులను అందరూ గౌరవిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరొచ్చు.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు చంద్రుడు, గురుడి ప్రభావంతో మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు లభించే అవకాశం ఉంది. తోబుట్టువుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మెరుగైన సామరస్యం, సహకారం నెలకొంటాయి. సమాజంలో మీకు కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. మీ భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు కెరీర్ పరంగా మంచి పురోగతికి అవకాశాలు లభించొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు పనులన్నీ అంకితభావంతో పూర్తి చేసే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవ్వొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభ యోగాల కారణంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీ బంధువులతో సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీకు సహోద్యోగుల నుంచి సహకారం లభించే అవకాశాలున్నాయి. విద్యార్థులు మంచి విజయాలు సాధించొచ్చు. మీ వ్యక్తిగత జీవితం మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి చూపుతారు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్యరాశి వారికి ఈరోజు చిరస్మరణీయైన రోజుగా నిలిచే అవకాశం ఉంది. మీ శక్తి, సామర్థ్యాలను పెంచుకుంటారు. మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు స్నేహితులతో వినోదాత్మకంగా గడపొచ్చు. వ్యాపారులు మంచి లాభాలు పొందొచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి భావాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినొచ్చు.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. బుధుడి అనుగ్రహంతో మీ తెలివితేటలు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు పనులను పూర్తి చేసేందుకు కొత్త అవకాశాలను పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాముల సహకారంతో మంచి లాభాలు రావొచ్చు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు వ్యాపారులు కొంత రిస్క్ చేయడం కారణంగా మంచి లాభాలు పొందొచ్చు. మీ కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించనున్నాయి. మీరు చేసే పనిలో కొత్త ఉత్సాహం ఉంటుంది. ఈరోజు మీరు చాలా చురుగ్గా ఉండాలి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఈరోజు మీరు పనికి సంబంధించి కొంత దూరం ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం వల్ల మీకు కొన్ని లాభాలు రావొచ్చు. మీకు కొత్త పరిచయాలు ఏర్పడొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ప్రియమైన వారి కోసం డబ్బు ఏర్పాటు చేయాల్సి రావొచ్చు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు కుజుడు రెండో స్థానంలో, చంద్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ ధైర్యం పెరుగుతుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ పెండింగ్ పనులన్నీపూర్తయ్యే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. మీ పూర్వీకుల నుంచి ఆశీస్సులు పొందుతారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ తోబుట్టువుల నుంచి సహకారం లభిస్తుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో మార్పుల కారణంగా మీకు ఆరోగ్య పరంగా కొంత సమస్యలు ఎదురుకావొచ్చు. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. లేదంటే నష్టపోవాల్సి రావొచ్చు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు కొంత రిస్క్ తీసుకోవడం ద్వారా సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఓర్పు, సహనం ప్రదర్శించడం ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీ తెలివితేటలను ఉపయోగించి పనులను పూర్తి చేస్తారు. ఈరోజు అవసరంలో ఉన్న వ్యక్తులకు సాయం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *